Siddhu Jonnalagadda: స్టార్ బాయ్ సిద్దు.. 'తెలుసు కదా' మొద‌లు పెట్టాడు

ABN , Publish Date - Aug 06 , 2024 | 09:14 PM

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ న‌టిస్తోన్న నూత‌న చిత్రం 'తెలుసు కదాస‌. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మంగ‌ళ‌వారం ప్రారంభమైంది.

Telusu Kada

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagada) టిల్లు స్క్వేర్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత న‌టిస్తోన్న నూత‌న చిత్రం 'తెలుసు కదా' (TelusuKada). ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తోంది. సిద్దు స్టార్‌డమ్‌ను దృష్టిలో ఉంచుకుని నీరజ కోన పర్ఫెక్ట్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాలని నిర్మించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ 'తెలుసు కదా' మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

30 రోజుల పాటు జ‌రుగ‌నున్న ఈ కీల‌క షెడ్యూల్‌లో టాకీ సీన్స్, మ్యూజిక్ నెంబర్స్ షూట్ చేయ‌నున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా (Raashi), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) క‌థానాయుక‌లుగా న‌టిస్తోండ‌గా మొదటి రోజు షూటింగ్‌లో సిద్దూతో కలిసి రాశీ ఖన్నా జాయిన్ అయింది. వైవా హర్ష ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు.


TelusuKada

నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ ఈ సినిమాని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండ‌గా, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్. బిజీ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకరైన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్. శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు.

Updated Date - Aug 06 , 2024 | 09:14 PM