Shruti Haasan: ఎస్.. సింగిల్‌గానే ఉన్నా.. ఆనందంగా ఉన్నా!
ABN , Publish Date - May 24 , 2024 | 04:23 PM
ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతి హాసన్ కొన్నేళ్ల గా రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే! ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.
ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో (Santanu Hazarika) శ్రుతి హాసన్ (Shruti Haasan) కొన్నేళ్ల గా రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే! ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కమల్‌హాసన్ ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్ కు కూడా శాంతను పంచెకట్టులో వచ్చి ఆకట్టుకున్నాడు. అయితే గత ఆరు నెలలుగా శ్రుతిహాసన్ తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయినట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై శ్రుతీ ఇప్పటి దాకా స్పందించలేదు. తన మ్యూజిక్, సినిమాలు, ఆల్బమ్స్ అంటూ బిజీగా గడుపుతోంది. తాజాగా ఆమె ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇన్‌స్టా వేదికగా ‘ఆస్క్ మీ ఎనిథింగ్’ పేరిట పాలోవర్స్‌తో ముచ్చటించిన శ్రుతి.. తన రిలేషన్ స్టేటస్ గురించి మాట్లాడారు. ఇందులో ఓ నెటిజన్ ‘మీరు సింగిలా.. రిలేషన్‌లో ఉన్నారా’ అని ప్రశ్నించడంతో ఆమె జవాబిచ్చింది. ‘నాకు ఈ తరహా ప్రశ్నలు నచ్చవు. కానీ, చెబుతున్నాను. ఇప్పుడు నేను సింగిలే. రిలేషన్ కోసం ఎదురుచూస్తున్నా. ప్రస్తుతానికి నా పనిలో నిమగ్నమై ఉన్నాను. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా’’ అని తెలిపారు.
డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతి హాసన్ ప్రేమలో ఉన్నట్లు కొన్నేళ్ల క్రితం ప్రకటించారు. అతడితో దిగిన ఫొటోలను తరచూ పోస్ట్ చేేసవారు. కొన్ని నెలలుగా ఆమె ఎలాంటి ఫొటోలను షేర్ చేయకపోవడంతో వీళ్లిద్దరూ విడిపోయారనే ప్రచారం మొదలైంది. నెల క్రితం శ్రుతిహాసన్, శాంతను ఇన్‌స్టాలో ఆన్ ఫాలో అయ్యారు. కలిసున్న ఫొటోలను డిలీట్ చేయడంతో బ్రేకప్ వార్తలు జోరందుకున్నాయి. తాజాగా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘‘ఇదొక క్రేజీ ప్రయాణం. ఇందులో నా గురించి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఇతరుల గురించీ అర్థం చేసుకున్నా’’ అని పేర్కొన్నారు. ఇక శ్రుతీ హాసన సినిమా విషయానికొస్తే శ్రుతి గతేడాది ఐదు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ‘సలార్’కు కొనసాగింపుగా రానున్న ‘సలార్ శౌర్యంగపర్వం’లో నటించనున్నారు. అడివి శేష్ హీరోగా రానున్న ‘డకాయిట్’లో కథానాయికగా నటిస్తున్నారు. ‘చెన్నై స్టోరీ’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.