Shruthi Haasan: అడివి శేష్‌ ఇన్‌వాల్వ్‌మెంట్‌ కారణమా..

ABN , Publish Date - Oct 15 , 2024 | 02:27 PM

అడివి శేష్‌ (Adivi sesh) హీరోగా షనైల్‌ డియో (Shaneil Deo) దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో శ్రుతీహాసన్‌ (Shruti Haasan) కథానాయికగా నటిస్తోంది. సగానికి పైగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది

అడివి శేష్‌ (Adivi sesh) హీరోగా షనైల్‌ డియో (Shaneil Deo) దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో శ్రుతీహాసన్‌ (Shruti Haasan) కథానాయికగా నటిస్తోంది. సగానికి పైగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. అయితే తాజా సమాచారం ప్రకారం శ్రుతీహాసన్‌ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. డేట్లు సర్టుబాటు సమస్యలో శ్రుతీ ఈ ప్రాజెక్ట్‌ నుంచి బయటకు వచ్చినట్లు, ఆమె స్థానంలో వేరే హీరోయిన్‌ వేటలో ఉన్నారని సమాచారం. డైరెక్టర్‌ షనైల్‌ డియో  ఫ్యామిలీలో ట్రిప్‌కు విదేశాలకు వెళ్లిన క్రమంలో సినిమాలోని కొన్ని షాట్‌లను హీరో అడివి శేష్‌ తెరకెక్కించేందుకు ప్రయత్నించారని, అది నచ్చకే శ్రుతి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి సిద్ధమయినట్లు మరో ప్రచారం జరుగుతోంది.


 
అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేష్‌ గత చిత్రాలైన క్షణం, గూఢచారి లాంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన షనైల్‌ డియోను డైరెక్టర్‌  గా  పరిచయం చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేసింది. ఇంటెన్స్‌, లవ్‌ యాక్షన్‌ చిత్రంగా డెకాయిట్‌ తెరకెక్కుతోంది.  ప్రస్తుతం శ్రుతి హాసన్‌   'సలార్‌-2', రజినీకాంత్‌ 'కూలీ' సినిమాల్లో నటిస్తోంది. 

Updated Date - Oct 15 , 2024 | 02:27 PM