Mr. Bachchan: ఓ రేంజ్‌లో.. ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ యాక్షన్ ప్యాక్డ్ షో రీల్

ABN , Publish Date - Jun 17 , 2024 | 09:59 PM

షాక్‌, మిరపకాయ్ వంటి హిట్ చిత్రాల త‌ర్వాత‌ హరీష్‌ శంకర్‌, రవితేజ కాంబినేషన్‌లో  తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. తాజాగా ఈ సినిమా నుంచి ఓ షో రీల్ వీడియోని రిలీజ్ చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు.

Mr. Bachchan: ఓ రేంజ్‌లో.. ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ యాక్షన్ ప్యాక్డ్ షో రీల్
Mr Bachchan

షాక్‌, మిరపకాయ్ వంటి హిట్ చిత్రాల త‌ర్వాత‌ హరీష్‌ శంకర్‌(Harish Shankar), రవితేజ (Ravi teja) కాంబినేషన్‌లో  తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan). పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ షో రీల్ (MrBachchan Show Reel) వీడియోని రిలీజ్ చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ షోరీల్ సినిమాపై అంచ‌నాల‌ను మరింతగా పెంచింది.

GQRgVcNXoAAfwRZ.jpeg

ఒక్క‌టంటే ఒక్క‌ డైలాగ్‌ లేకుండా కంప్లీట్ యంగేజింగ్‌గా కట్ చేయ‌డం ఈ షోరీల్ (MrBachchan Show Reel) ప్ర‌త్యేక‌త. ఇందులో హరీష్ శంకర్. రవితేజ స్టైలిష్, మాస్ క్యారెక్టర్‌లో పరిచయం కాగా, జగపతి బాబు ఓల్డ్ ఫెరోషియస్ మ్యాన్ గా కనిపించారు. రవితేజ గెటప్ క్లాస్‌గా ఉంది. చివ‌ర‌లో రవితేజ అమితాబ్ బచ్చన్‌ను ఇమిటేట్ చేసే చివరి సీన్ కన్నుల పండువగా ఉంది.


GQRXd_HbMAAjps1.jpeg

భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్ నటిస్తుండగా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇద్దరూ షోరీల్ (MrBachchan Show Reel)లో కనిపించారు. టెక్నికల్ గా.. అయనంక బోస్ అందించిన ఎక్స్ ట్రార్డినరీ కెమెరా వర్క్, మిక్కీ జె మేయర్ అందించిన అప్‌లిఫ్టింగ్ స్కోర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి కావస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Updated Date - Jun 17 , 2024 | 09:59 PM