నలుగురు సీఎంలతో నటించిన హీరోయిన్.. ఆమె లైఫ్‌లో ఎవరికీ తెలియని 7 సీక్రెట్స్

ABN , Publish Date - Dec 12 , 2024 | 12:07 PM

93 ఏళ్ల వయసు.. 74 ఏళ్ల సినీ కెరీర్.. నటిగా ఆమె చేయని పాత్ర, చూడని విజయం, అందుకోని అవార్డు-రివార్డు లేదు. బ్లాక్‌ అండ్ వైట్ నుంచి ఈస్ట్‌మన్ కలర్ వరకు.. టుడీ ఎరా నుంచి త్రీడీ జనరేషన్ వరకు.. తెలుగు చిత్రసీమ గమనంలో కీలక మైలురాయిగా ఉంటూ వచ్చారామె. ఆమెనే అలనాటి అందాల తార, పద్మశ్రీ షావుకారు జానకి.

93 ఏళ్ల వయసు.. 74 ఏళ్ల సినీ కెరీర్.. నటిగా ఆమె చేయని పాత్ర, చూడని విజయం, అందుకోని అవార్డు-రివార్డు లేదు. బ్లాక్‌ అండ్ వైట్ నుంచి ఈస్ట్‌మన్ కలర్ వరకు.. టుడీ ఎరా నుంచి త్రీడీ జనరేషన్ వరకు.. తెలుగు చిత్రసీమ గమనంలో ఓ కీలక మైలురాయిగా ఉంటూ వచ్చారామె. ఆమెనే అలనాటి అందాల తార, పద్మశ్రీ షావుకారు జానకి(Shavukaru Janaki). అందమే అసూయ చెందే ముగ్ధమనోహర రూపం, విశిష్ట నటనా పటిమ, కళ్లుచెదిరే నృత్యంతో కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారామె. జనరేషన్స్ మారినా మర్చిపోని ఈ ఎవర్‌గ్రీన్ యాక్ట్రెస్  ఇవాళ పుట్టిన రోజును (, Shavukaru Janaki Birthday) సెలెబ్రేట్ చేసుకుంటున్నారు . నలుగురు ముఖ్యమంత్రులతో నటించిన ఈ గ్రేట్ హీరోయిన్ గురించి ఎవరికీ తెలియని పలు రహస్యాల గురించి ఇప్పుడు చూద్దాం..

Shavukaru.jpg

- 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించారు షావుకారు జానకి(Shavukaru Janaki). ఆమె తండ్రి పేరు టి.వెంకోజీరావు, తల్లి సచీదేవి.

- 14 ఏళ్ల వయసలో మద్రాసులోని ఆకాశవాణిలో రేడియో ఆర్టిస్ట్‌గా పనిచేశారు. అదే టైమ్‌లో కొన్ని నాటకాల్లోనూ యాక్ట్ చేశారు.

- చిన్న వయసులోనే జానకీకి పెళ్లయింది. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా 18 ఏళ్ల వయసులో ‘షావుకారు’ అనే సినిమాలో సుబ్బులు రోల్‌లో మహానటుడు ఎన్టీఆర్ సరసన ఆమె నటించారు. (Telugu Film Industry)

- తొలి చిత్రం ‘షావుకారు’ జానకీకి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది. తర్వాత ఈ మూవీ పేరు ఆమె ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. ఎన్టీఆర్‌కు ఆమెనే తొలి హీరోయిన్. ఆమెకు కూడా ఆయనే ఫస్ట్ హీరో కావడం విశేషం.

Shavuikar-2.jpg

- ఎన్టీఆర్‌తో పాటు కోలీవుడ్ దిగ్గజ నటులు ఎంజీఆర్, జయలలిత, కరుణానిధితోనూ జానకి కలసి నటించారు. వీళ్లందరూ ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. అలా నలుగురు సీఎంలతో నటించిన ఖ్యాతిని గడించారామె.

- జానకి చెల్లెలు కృష్ణకుమారి (Krishna Kumari0 కూడా తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా హవా నడిపించారు.

Shavukaru-3.jpg

- తెలుగులో కంటే తమిళంలోనే హీరోయిన్‌గా ఎక్కువ సినిమాలు చేశారు జానకి. అక్కడ ఎంజీఆర్‌తో పాటు శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ సరసన నాయికగా అలరించారు. తమిళనాడు ప్రభుత్వం సిఫార్సుతో 2022లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం దక్కింది.(Tollywood)

- వయసు మీద పడినా 90 ఏళ్లు దాటినా షావుకారు జానకి నటన మానడం లేదు. ఇప్పటికీ టాలీవుడ్‌లో తన అభిరుచికి తగ్గ క్యారెక్టర్స్ వస్తే ముఖానికి రంగు వేసుకుంటున్నారు.

Updated Date - Dec 12 , 2024 | 12:26 PM