Sharwanand: సక్సెస్ పార్టీ పిఠాపురంలో జరగాలన్నది కోరిక
ABN , Publish Date - Jun 06 , 2024 | 09:28 PM
శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మనమే'. అయన హీరోగా నటిస్తున్న 35వ సినిమా ఇది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు.
శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మనమే'. అయన హీరోగా నటిస్తున్న 35వ సినిమా ఇది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. 'మనమే' జూన్ 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
స్టార్ శర్వా మాట్లాడుతూ "ముందుగా మనమే వస్తామని చెప్పి ముచ్చటగా నాలుగో సారి సీఎం అయిన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, హ్యాట్రిక్ కొట్టిన మా బాలకృష్ణ గారికి, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హార్టీ కంగ్రాజులేషన్స్. చాలా సంతోషంగా వుంది. రిజల్ట్స్ వచ్చేశాయి. ఒక పండగ వాతావరణం స్టార్ట్ అయ్యింది. జూన్ 7న మనమే అంటూ మరో పండగ స్టార్ట్ అవుతోంది. దాని తర్వాత 27 కల్కి. మరో పండగ వాతావరణం. ఇక నుంచి అన్ని మంచి రోజులే. శ్రీరామ్ మనమే కథ ఎప్పుడో చెప్పారు. యాక్చువల్లీ నేను వేరే కథ చేయాలి. అయితే వరుసగా సీరియస్ సినిమాలు చేసేస్తున్నానని నాకే అనిపించింది. అందరూ కనబడినపుడు మహానుభావుడు, ఎక్స్ ప్రెస్ రాజా, రన్ రాజా రన్ లాంటి ఎంటర్ టైనర్స్ చేయమని కోరేవారు. నాకూ ఎప్పుడూ కొత్తగా చేయాలనే వుంటుంది. కథల్లో క్యారెక్టరైజేషనే కొత్తగా వుంటుంది. మనమే లో అలాంటి కొత్త క్యారెక్టరైజేషనే వుంది. మంచి కథ చేయాలి, ఎంటర్ టైన్నింగ్ గా వుండాలని అనుకున్నాం. అన్నీ సినిమాలు కాదని ఈ సినిమాని ఎంచుకోవడానికి కారణం ఒక బ్యూటీఫుల్ పాయింట్ టైం గురించి. మనిషి మనిషికి ఇవ్వగలిగే గొప్ప గిఫ్ట్ టైం. ఈ సినిమాలో శ్రీరామ్ ఆదిత్య ఈ పాయింట్ ని చాలా చక్కగా చెప్పారో చూస్తారు. లాస్ట్ 40 మినిట్స్ మిమ్మల్ని ఇంకో ప్రపంచంలోకి తీసుకెల్తారు. ఓన్లీ ఎంటర్ టైన్మెంట్ కి ఓ మంచి సినిమా తీయాలని చేశాం. ఎట్టిపరిస్థితిలో డిస్సాపాయింట్ చేయనివ్వం. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మిగతాది సక్సెస్ పార్టీలో మాట్లాడుకుందాం.సక్సెస్ అంటే గుర్తుకువచ్చింది. ఈ ఫంక్షన్ పిఠాపురంలో చేయాలని అనుకున్నాం. కానీ పర్మిషన్ దొరకలేదు. విశ్వ గారు ప్లాన్ చేస్తే సక్సెస్ పార్టీ ఫస్ట్ అక్కడ చేస్తాం. సినిమా సక్సెస్ పార్టీ పిఠాపురంలో జరగాలని నా కోరిక. సక్సెస్ కొట్టిన తర్వాత పిఠాపురంలో కలుస్తాం'' అని అన్నారు.
టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ నిన్న మన సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాం. ఇది కంటిన్యూ చేస్తూ.. మనమే గ్రేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అలరిస్తుంది. ఈ సినిమా చూశాను. అద్భుతంగా వచ్చింది. శర్వా పెర్ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీగా వుంది. తన ఛార్మింగ్ లుక్స్, పెర్ఫార్మన్స్ చూసి తనకి 'ఛార్మింగ్ స్టార్' అనే టైటిల్ ఇస్తున్నాను. మనమే అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం. దిని సక్సెస్ మీట్ ఆంధ్రప్రదేశ్ లో చాలా గ్రాండ్ చేస్తాం. సక్సెస్ మీట్ లో మరింత మాట్లాడుకుందాం' అన్నారు.
డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ..మనమే సినిమా నాకు పెద్ద డ్రీం. ఈ డ్రీం ని అచీవ్ చేయడానికి సపోర్ట్ చేసి నా రైటింగ్ టీమ్, లిరిక్ రైటర్స్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ టీం అందరికీ థాంక్స్. వివేక్ గారు చాలా సపోర్టివ్. కృతి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా డెబ్యు చేశారు. కృతి ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి లక్కీ ఛార్మ్. వండర్ ఫుల్ పర్శన్. విశ్వప్రసాద్ గారు డేరింగ్ ప్రొడ్యూసర్. ఇందులో ఓ రోల్ చేయడానికి యాక్సప్ట్ చేసిన శివకి థాంక్స్. వెన్నెల కిశోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, అయేషా, శీరత్ అందరికీ థాంక్స్. కృతి శెట్టి ఇందులో చక్కని పెర్ఫార్మెన్స్ వున్న రోల్ లో కనిపిస్తారు. తను చాలా సిన్సియర్. మనమే డ్రీం ని మొదటి నమ్మింది నా డార్లింగ్ శర్వా. నా డ్రీంని నా కంటే బలంగా నమ్మారు. సినిమాని ఇప్పటికే యాభై అరవైసార్లు చూశాను. చూసిన ప్రతిసారి విజల్ వేయాలనిపిస్తుంది. శర్వా క్యారెక్టర్ తో లవ్ లో పడిపోయాను. మనల్ని మనం నమ్మి నిలబడితే ఏ రేంజ్ లో అన్సర్ ఉంటుందా అనేది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. అదే ఇన్ స్ప్రేషన్ తో టీంలో అందరం 'మనమే'ని నమ్మి చేశాం. ఈ పండగ వాతావరణంని కంటిన్యూ చేసి సినిమా మనమే అవుతుంది. మీ పేరెంట్స్ ని తీసుకురండి. ఒక గొప్ప ఎక్స్ పీరియన్స్, ఎనర్జీని ఫీల్ అవుతారు' అన్నారు
హీరోయిన్ కృతిశెట్టి మాట్లాడుతూ.. శర్వా గారితో సినిమా చేస్తున్నాని మా ఫ్రెండ్స్ కి చెబితే ..ఫుల్ ఫ్యామిలీతో వెళ్లి చూస్తామని చెప్పారు. ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కూడా శర్వా గారితో చాలా కనెక్ట్ అవుతారు. పేరెంట్స్ తో వచ్చి చూడండి. చాలా ఫీల్ గుడ్ సినిమా ఇది. శర్వాగారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. శ్రీరామ్ గారు కథ చెప్పినప్పుడు ఎలాంటి మ్యాజిక్ కనిపించిందో సినిమా చూస్తున్నప్పుడు కూడా అదే మ్యాజిక్ ఫీల్ అయ్యాను. ఈ సినిమా పార్ట్ చేసిన డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారికి థాంక్స్. విక్కీ అన్ బిలివబుల్. తను చేసిన ప్రతి సీన్ చాలా ఎమోషనల్ గా అనిపించింది. హేశం బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వారితో మరోసారి కలసి పని చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని ఫ్యామిలీతో వచ్చి చూడండి. తప్పకుండా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది' అన్నారు.