Game Changer: గేమ్‌ ఛేంజర్‌’పై  శంకర్‌ కీలక వ్యాఖ్యలు 

ABN , Publish Date - Jul 11 , 2024 | 12:12 PM

రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’పై (Game Changer) దర్శకుడు శంకర్‌ (Shankar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’పై (Game Changer) దర్శకుడు శంకర్‌ (Shankar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘భారతీయుడు 2’ చిత్రం ప్రచారంలో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ‘‘నేను తీసిన తమిళ చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది. అందుకే నేరుగా తెలుగులోనే ఓ సినిమా తీయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాణ్ని. ఆ మేరకు చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు ‘గేమ్‌ ఛేంజర్‌’తో నా కల నెరవేరుతోంది. కార్తీక్‌ సుబ్బరాజు కథతో దీన్ని రూపొందిస్తున్నా. ఇది పూర్తిస్థాయి యాక్షన్‌ చిత్రం. నా నుంచి ఇలాంటి మాస్‌ సినిమా వచ్చి చాలా కాలమైంది’’ అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్‌ను రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ నెట్టింట పోస్ట్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

game.jpeg

‘గేమ్‌ ఛేంజర్‌’ మాస్‌ ఫిల్మ్‌ అంటూ ఫైర్‌ ఎమోజీలు పోస్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్‌ ద్విపాత్రాభినయం చేశారని తెలుస్తోంది. ఇందులో కియారా అడ్వాణి కథానాయిక అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌జే సూర్య, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషించారు. రామ్‌చరణ్‌కు సంబంధించిన చిత్రీకరణ ఇటీవల పూర్తయింది. దాదాపు 10 రోజుల షూటింగ్‌ మిగిలి ఉందని శంకర్‌ ఇటీవల చెప్పారు. ఫైనల్‌ ఎడిటింగ్‌ అయ్యాక రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తతమని చెప్పారు. కమల్‌ హాసన్‌ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘భారతీయుడు 2’ శుక్రవారం బాక్సాఫీసు ముందుకురానుంది. 1996లో వచ్చిన ుభారతీయుడు’కి సీక్వెల్‌ ఇది. సిద్థార్థ్‌, కాజల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్రధారులు. 

Updated Date - Jul 11 , 2024 | 12:14 PM