Crazy Rambo: షమ్ము హీరోగా.. మాస్ మసాలా ఎంటర్‌టైనర్ “క్రేజీ రాంబో”

ABN , Publish Date - Jul 29 , 2024 | 08:35 AM

షమ్ము హీరోగా హరీష్ మధురెడ్డి దర్శకత్వంలో మాస్ మసాలా ఎంటర్‌టైనర్ క్రేజీ రాంబో చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ వేడుకకు హీరో అశ్విన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

crazy rambo

షమ్ము (Shammu) హీరోగా హరీష్ మధురెడ్డి దర్శకత్వంలో, సప్తాశ్వ ప్రొడక్షన్స్ బ్యానర్ రూపొందనున్న మాస్ మసాలా ఎంటర్‌టైనర్ క్రేజీ రాంబో (Crazy Rambo) పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ వేడుకకు హీరో అశ్విన్ బాబు (Ashwin Babu) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కామెడీ, యాక్షన్, డ్రామా, రొమాన్స్‌తో రోలర్-కోస్టర్ రైడ్‌గా ఈ సినిమా ఉండబోతోంది.టైటిల్ రోల్‌లో హీరో షమ్ము చాలా ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.

టైటిల్ లాంచ్ ఈవెంట్ లో హీరో అశ్విన్ బాబు (Ashwin Babu) మాట్లాడుతూ.. క్రేజీ రాంబో (Crazy Rambo) టైటిల్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. సినిమా తప్పకుండా క్రేజీ గా ఉంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్, సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలి' అని కోరారు. హీరో షమ్ము మాట్లాడుతూ,.. ఇది నా మూడో సినిమా. మా అన్నయ్య ప్రొడక్షన్ లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. క్రేజీ రాంబో కథ చాలా బావుటుంది. అందరినీ అలరిస్తుంది' అన్నారు.


rambo.webpనిర్మాత, సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ.. డైరెక్టర్ మధు ఈ కథ చెప్పినపుడు నాకు చాలా నచ్చింది. మా తమ్ముడు హీరోగా నేనే నిర్మించాలని అనుకున్నాను. చాలా మంచి కంటెంట్. అందరినీ ఎంటర్ టైన్ చేసేలా సినిమా ఉంటుంది' అన్నారు. ఈ చిత్రానికి ర్యాప్ రాక్ షకీల్ మ్యూజిక్ అందిస్తుండ‌గా, సినిమాటోగ్రఫీ జైపాల్ రెడ్డి చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Updated Date - Jul 29 , 2024 | 08:35 AM