Nidhhi Agerwal: 2025 సంవత్సరం మాత్రం నిధి అగర్వాల్‌దే!

ABN , Publish Date - Dec 30 , 2024 | 07:59 PM

అందాల నిధికి 2024 సంవత్సరం నిరాశనే మిగిల్చింది. కానీ 2025 మాత్రం నాదే అని అంటోంది నిధి అగర్వాల్. రాబోయే నూతన సంవత్సరంలో ఆమె నటించిన రెండు భారీ సినిమాలు బాక్సాఫీస్‌ని పలకరించబోతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరంపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని, ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది.

Nidhhi Agerwal

నిధి అగర్వాల్.. పేరుకు తగ్గట్టే అందాల నిధి. కానీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. మంచి బ్రేక్ కోసం ఈ అమ్మడు ఎదురు చూస్తుంది. అయితే 2025 మాత్రం తనదే అంటుందీ భామ. 2025 తన కెరీర్‌లో మరిచిపోలేని అనుభూతుల్ని ఇస్తుందని కాన్ఫిడెంట్‌గా చెబుతూ.. న్యూ ఇయర్‌కి వెల్‌కమ్ చెబుతోంది. 2025పై ఆమె అంత కాన్ఫిడెంట్‌గా ఉండటానికి కారణం లేకపోలేదు.. అదేంటంటే..


Nidhhi-Agarwal.jpg

న్యూ ఇయర్ కోసం క్యూరియస్‌గా వెయిట్ చేస్తోంది బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఆమె నటించిన రెండు బిగ్ టికెట్ మూవీస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’, రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’ చిత్రాలు 2025వ సంవత్సరంలో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌ తనను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడమే కాకుండా.. బిజీ హీరోయిన్‌ని చేస్తాయని ఈ అందాల నిధి ఆశిస్తోంది.

Also Read-Kannappa Heroine: ‘కన్నప్ప’ హీరోయిన్.. కత్తిలా ఉంది


Nidhhi.jpg

‘ది రాజా సాబ్’ సినిమాను మూవీ టీమ్ ఎంతో డెడికేటెడ్‌గా రూపొందిస్తున్నారని.. ప్రభాస్‌తో కలిసి వర్క్ చేయడం మరిచిపోలేనని నిధి చెబుతోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటించడం ఎంతో హ్యాపీగా ఉందని తెలిపింది. ఈ రెండు భారీ చిత్రాలతో పాటు తెలుగు, తమిళంలో మరికొన్ని సర్ ప్రైజింగ్ మూవీస్‌ను న్యూ ఇయర్‌లో అనౌన్స్ చేయనుంది నిధి అగర్వాల్. మరి 2024లో నిరాశ పరిచిన ఈ అమ్మడు.. 2025లో ఏం చేస్తుందో.. ఇప్పుడున్న హెవీ కాంపిటేషన్‌లో ఎలా నెట్టుకొస్తుందో చూద్దాం.


Aslo Read-Game Changer: డిప్యూటీ సీఎం డేట్ ఇస్తే.. హిస్టరీ రిపీట్ అవుద్ది..

Also Read-Yearender 2024 ఆర్టికల్స్..

Also Read-Devi Sri Prasad: 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్' వెనుక ఏం జరిగిందంటే..

Also Read-Tollywood: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ‘మా’ మంచు విష్ణు అలెర్ట్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 30 , 2024 | 07:59 PM