Sayaji Shinde: ఛాతీ నొప్పితో ఆస్పత్రికి.. ప్రస్తుతం ఎలా ఉందంటే..
ABN , Publish Date - Apr 12 , 2024 | 01:01 PM
ప్రముఖ నటుడు సాయాజి షిండే ఆస్పత్రి పాలయ్యారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు.
ప్రముఖ నటుడు సాయాజి షిండే (Sayaji Shinde) ఆస్పత్రి పాలయ్యారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి (Chest pain) రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ (Angioplasty) చేశారు. ప్రస్తుతం సాయాజి షిండే ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వైద్యుడు సోమనాథ్ మాట్లాడుతూ.. ‘సాయాజి షిండే కొద్దిరోజుల క్రితమే అస్వస్థతకు లోనయ్యారు.
దీంతో ఆయనకు కొన్ని పరీక్షలు చేయగా తన గుండెలో సమస్య ఉన్నట్లు తేలింది. హృదయంలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయాయి. ఆంజియోప్లాస్టీ చేయాలని చెప్పాం. దీంతో తన షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని చికిత్స కోసం రెడీ అయ్యారు. పరిస్థితి విషమించకముందే జాగ్రత్తపడటం తో విజయవంతంగా సర్జరీ పూర్తి చేశాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. రెండురోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం’ అని తెలిపారు. సాయాజి షిండే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశాడు. తెలుగులో.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చక్కని అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు.