Sai durga Tej: 'సత్య' షార్ట్ ఫిలింకు పీపుల్స్ ఛాయిస్ అవార్డు 

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:02 AM

సాయి దుర్గ తేజ్, స్వాతి నటించిన 'సత్య' (Satya short Film) షార్ట్  ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెల్సిందే. దీనికి అరుదైన గౌరవం దక్కింది

సాయి దుర్గ తేజ్ (Sai Durga tej) , స్వాతి (Swathi) నటించిన 'సత్య' (Satya short Film) షార్ట్  ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెల్సిందే.  ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2024లో పీపుల్స్ ఛాయిస్ (People Choice award) కేటగిరిలో  అవార్డు గెల్చుకుంది.  ఈ విషయాన్ని టీమ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.  ఇందులో స్వాతి రెడ్డి హీరోయిన్ గా నటించింది. హర్షిత్, హన్షిత నిర్మాతలుగా వ్యవహరించారు. విజయకృష్ణ వీకే దర్శకత్వం వహించారు. మ్యూజికల్ షార్ట్ ఫిలింగా "సత్య" ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చింది.

ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ తన 18వ చిత్రంతో బిజీగా ఉన్నారు. కె.పి . రోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణం దశలో ఉంది. ఇందులో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది. శ్రీకాంత్, జగపతిబాబు కీలకపాత్రను పోషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు చక్కని స్పందన వచ్చింది. 

Updated Date - Dec 02 , 2024 | 11:02 AM