‘సంధ్యారాగం’ దర్శకుడికి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్.. ఎక్కడంటే

ABN , Publish Date - Nov 14 , 2024 | 09:27 PM

అయోధ్య రాముని పాదుకలు, యాదాద్రి పుణ్యక్షేత్ర రూపశిల్పి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీ తదితర విగ్రహాలను అద్భుతంగా రూపం ఇచ్చిన శిల్ప కళాకారులను, సామాజిక బాధ్యతతో సినిమా రంగంలో ప్రతిభను చాటుతున్న కళాకారులను విశ్వకర్మ లీడర్ అవార్డ్స్‌లో సత్కరించారు. ఇంకా..

వివిధ రంగాల్లో తమ ప్రతిభను కనపరుస్తూ సామాజిక బాధ్యతతో ముందుకువెళుతూ విశ్వకర్మ సమాజానికి స్ఫూర్తివంతంగా నిలుస్తున్న విశ్వకర్మ కళాకారులకు విశ్వకర్మ లీడర్ అవార్డ్స్ ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. బుధవారం రాత్రి న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటెల రాజేందర్, మల్లు రవి, సిరికొండ మధుసూదనాచారి, తల్లోజు ఆచారి, విశ్వనాథుల పుష్పగిరి హాజరై.. విశ్వకర్మ ప్రతిభావంతులకు విశ్వకర్మ లీడర్ అవార్డ్స్ అందజేశారు.

Also Read-మిల్కీ బ్యూటీ తమన్నాలో ఈ మార్పు చూశారా..

ఈ సందర్భంగా గణేష్ చారి మాట్లాడుతూ.. అయోధ్య రాముని పాదుకలు, యాదాద్రి పుణ్యక్షేత్ర రూపశిల్పి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీ తదితర విగ్రహాలను అద్భుతంగా రూపం ఇచ్చిన శిల్ప కళాకారులను, సామాజిక బాధ్యతతో సినిమా రంగంలో ప్రతిభను చాటుతున్న కళాకారులను సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో సుమారు 100 మంది కళాకారులకు అవార్డ్స్ ఇవ్వడం గొప్ప విషయమని, ఈ గొప్ప కార్యక్రమానికి పూనుకున్న విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఫౌండర్ విశ్వనాథుల పుష్పగిరి సేవలను గణేష్ చారి కొనియాడారు. ‘సంధ్యారాగం’ లాంటి సామాజిక అంశంతో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్ నేదునూరిని మధుసూదనాచారి, మల్లు రవి గార్లు అభినందించారు. ముందుముందు మరిన్ని మంచి చిత్రాలను రూపొందించి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆకాంక్షించారు.


Srinivas-Nedunuri.jpg

అవార్డు అందుకున్న అనంతరం దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి మాట్లాడుతూ.. శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి రోజున ఈ విశిష్ట అవార్డుకు ఎంపిక చేసి ఉత్తమ దర్శకుడి అవార్డుతో సత్కరించినందుకు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఫౌండర్ విశ్వనాదుల పుష్పగిరికి, అభినందించి ప్రోత్సహించిన రాజకీయ ఉద్దండులు ఈటెల రాజేందర్‌కి, మల్లు రవికి, మధుసూదనాచారికి, గణేష్ చారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్ఫూర్తితో మంచి చిత్రాలను రూపొందిస్తానని అన్నారు. ‘సంధ్యారాగం’ చిత్రానికి 2024 ఏడాది మూడు పురస్కారాలు వరించడం ఆనందించదగ్గ విషయమని, ఈ విజయానికి కారణమైన నాకు వెన్నుదన్నుగా నిలిచిన పైల రమేష్ (USA), శిస్టు రమేష్ అడ్వకేట్, ఏ ఆర్ జి నాయుడులతో పాటు.. ఈ చిత్ర హీరో సుహాస్ శిస్టు, సినిమాటోగ్రాఫర్ చింతయ్య, జి ఎల్ బాబులకు.. దర్శకత్వ విభాగానికి, చిత్ర బృందానికి, ఈ చిత్రాన్ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్ రావు అప్పారావుకి, మయూరి సంస్థకి, సపోర్ట్‌గా నిలిచి చిత్ర సమర్పకురాలిగా వ్యవహరించిన సునీత శ్రీనివాస్‌కి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుతో పాటు, హిందీలో ఇట్స్ మై లవ్ పేరుతో సంధ్యారాగం చిత్రం ప్రముఖ సంస్థ పెన్ మూవీస్‌లో స్ట్రీమింగ్ జరుగుతోందని, త్వరలో తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసే సన్నాహాలు జరుగుతున్నాయని దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి అన్నారు.

Also Read- Kanguva Review: సూర్య నటించిన యాక్షన్ డ్రామా ‘కంగువా’ ఎలా ఉందంటే...

Also Read-Matka Review: 'మట్కా'తో వరుణ్‌ తేజ్‌ హిట్‌ కొట్టాడా...

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 14 , 2024 | 09:27 PM