Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ ఘటనలో బాలుడి ఆరోగ్యం ఎలా ఉందంటే..
ABN , Publish Date - Dec 15 , 2024 | 09:24 AM
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడి ఆరోగ్యంపై స్పష్టత వచ్చింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందగా ఆమె కుమారుడుని ICUలో చేర్చి చికిత్స అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలుడి ఆరోగ్యం విషయంలో పలు విభిన్న వార్తలు ప్రచారం కావడం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఫేక్ వార్తలన్నింటిని కొట్టిపారేస్తూ విశ్వసనీయ సమాచారం ఒకటి బయటకొచ్చింది. ఆ సమాచారం ఏంటంటే..
పనిగట్టుకొని మరి కొందరు బాలుడి ఆరోగ్యం విషయంలో దుష్ప్రచారాలు చేస్తున్నారని అల్లు అర్జున్ టీమ్ ఆరోపించింది. బన్నీకి అత్యంత సన్నిహిత వర్గం బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
మరోవైపు ఈ కేసుపై మృతురాలి రేవతి భర్త భాస్కర్ మాట్లాడుతూ.. ఈ కేసు ఉపసంహరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.అల్లు అర్జున్అరెస్ట్ విషయం తనకు తెలియదని, టీవీలో చూసి విషయం తెలుసుకున్నట్లు చెప్పారు. తన భార్య మరణించిన తొక్కిసలాటతో అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. వాస్తవానికి డిసెంబర్ 4న రాత్రి అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వెళ్లారు. ఆ క్రమంలో వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. ఆ తొక్కిసలాటలో రేవతి అనే 35 ఏళ్ల మహిళ మృతి చెందగా, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు గాయపడ్డారు. దీంతో మహిళ కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ జస్టిస్ కోడ్ సెక్షన్ 105, 118 (1) కింద అల్లు అర్జున్, ఆయన భద్రతా బృందం, థియేటర్ యాజమాన్యంపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.