సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటపై రేవతి భర్త భాస్కర్ స్పందనిదే..

ABN , Publish Date - Dec 05 , 2024 | 12:32 PM

పుష్ప 2 మూవీ నైట్ ప్రీమియర్స్ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్ RTC క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్‌కు చిత్ర హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా.. ఆ మహిళ కుమారుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై మృతి చెందిన మహిళ భర్త స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

Bhaskar

హీరో అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో దిల్‌సుఖ్‌ నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ (39) మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల పిల్లాడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా సమాచారం. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే ఈ ఘటపై రేవతి భర్త భాస్కర్ మీడియతో మాట్లాడారు. తన కుమారుడు అల్లు అర్జున్‌కు అభిమాని కావడంతో.. అతని కోసమే వారంతా కుటుంబంతో కలిసి సినిమాకు వచ్చినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఘటన ఎలా జరిగిందో కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ..

Also Read-Pushpa 2 Review: అల్లు అర్జున్ 'పుష్ప -2' ఎలా ఉందంటే...

‘‘మా బాబు అల్లు అర్జున్‌కు అభిమాని. వాడి కోసమే మేము సినిమాకి వచ్చాము. అందరూ మా బాబుని పుష్పా అని పిలుస్తారు. వాడి కోసమే అంతా సినిమాకు వచ్చాం.. కానీ ఇలా తొక్కిసలాట జరిగి నా భార్యను కోల్పోవడం తట్టుకోలేక పోతున్నాను. పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహలోకి వచ్చాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు. అప్పటికి అభిమానులు మాములుగానే ఉన్నారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ వచ్చారో.. ఒక్కసారిగా క్రౌడ్ పెరిగింది. తొక్కిసలాట జరిగింది. మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు..’’ అని రేవతి భర్త భాస్కర్ తెలిపారు.


Pushpa-2.jpg

అయితే ఇప్పటి వరకు ఈ ఘటనసై అల్లు అర్జున్ స్పందించలేదు. ఈ ఘటనపై వెంటనే అల్లు అర్జున్ స్పందించి, కుటుంబానికి అండగా ఉండాలని ఉండాలని డిమాండ్ చేస్తున్నారు భాస్కర్ బంధువులు. అలాగే సంధ్య థియేటర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.

మరో వైపు అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ మరిణించిందని, దీనికి అల్లు అర్జున్, పోలీసులు, నిర్మాతలు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ సమయంలో అల్లు అర్జున్ అక్కడకు రావాల్సిన అవసరం ఏముంది అంటూ ఆయన ప్రశ్నించారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని, అలాగే మృతురాలి కుటుంబానికి రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.


ఈ తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, వీడియోస్ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. ఈ ధర్నాలకు దిగిన విద్యార్థి సంఘాలను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేస్తుండటంతో మరోసారి సంధ్య థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ‘బాధితురాలు కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. సంధ్యా థియేటర్ యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ప్రీమియర్ షోకు వచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సినీ హీరో అల్లు అర్జున్‌పై కేసులు పెట్టాలి’ అని విద్యార్థి సంఘాల నేతల డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసిన విద్యార్థి సంఘాల నేతలని అబిడ్స్ పోలీస్ స్టేషనల్‌కు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Also Read-SoChay Wedding: ఘనంగా నాగ చైతన్య, శోభితల వివాహం.. కింగ్ నాగ్ స్పందనిదే..

Also Read-Dushara Vijayan: అందువల్ల పెళ్ళి ప్రస్తావన ఇప్పట్లో ఉండదు

Also Read-SS Rajamouli: ఆ ఒక్క సీన్‌తో సినిమా ఏంటో అర్థమైపోయింది


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 05 , 2024 | 01:57 PM