Sandeep Reddy Vanga: అందుకే అమ్మ పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వను.. సందీప్ రెడ్డి

ABN , Publish Date - Dec 07 , 2024 | 09:06 AM

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో ఫిమేల్ క్యారెక్టర్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

సందీప్ రెడ్డి వంగా.. ఇండియన్ సినీ ఇండస్ట్రీని ఎప్పుడు షేక్ చేసే పేరు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో పెద్ద కార్చిచ్చునే రాజేశాడు. నెక్స్ట్ స్పిరిట్, యానిమల్ పార్క్ సినిమాలతో వైల్డ్ ఫైర్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే సినీ క్రిటిక్స్, సెలబ్రిటీస్, సోషల్ మీడియా, వ్యక్తిగతంగా ఇలా ఆయనను విమర్శించే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఆయన సినిమాల్లో మహిళల క్యారెక్టర్లని డిజైన్ చేసే విధానంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. తాజాగా అలాంటి ఒక విమర్శపై సందీప్ క్లారిటీ ఇచ్చాడు.


సందీప్ రెడ్డి సినిమాల్లో ప్రతి క్యారెక్టర్ డీప్ ఇంటెన్స్‌తో కనిపిస్తుంది. కానీ, మదర్ క్యారెక్టర్‌కి మాత్రం పెద్ద ప్రాముఖ్యత ఉండదు. దీనిపై పెద్ద విమర్శలే ఉన్నాయి. తాజాగా ఈ విమర్శలను సందీప్ అంగీకరించారు. ఆయన మాట్లాడుతూ.. " నా లైఫ్ జర్నీలో ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో కీలకమైనది. మెయిన్‌గా మా మదర్ నాకు ఎంతో సహకరించారు. నా యాక్టింగ్ స్కూల్ ఫీజులతో పాటు అర్జున్ రెడ్డి ప్రొడక్షన్ కి ఎంతో సహకరించింది. ఒక దశలో నేను మా అమ్మనే ఎదిరించి మాట్లాడాను. అయితే నేను మా అమ్మకి ఎంతో అటాచ్ అయ్యి ఉంటాను. మా రిలేషన్ షిప్‌లో ఎలాంటి డ్రామా, కంప్లైంట్‌లు లేవు. ఇది నా సినిమా స్టోరీలో కాన్‌ఫ్లిక్ట్స్‌కి ఉపయోగపడదు. నా కథలకి కావాల్సింది కాన్‌ఫ్లిక్ట్స్. మా మదర్ రిలేషన్‌షిప్ నన్ను అలాంటి స్టోరీలు రాసేందుకు ఇన్స్పైర్ చేయలేదు. ఒకవేళ నేను మదర్ స్టోరీ చేస్తే.. గుడ్ వైబ్స్‌తోనే ఉంటుంది" అన్నారు


‘సందీప్‌ వంగా ప్రస్తుతం ‘స్పిరిట్‌’తో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత ‘యానిమల్‌ పార్క్‌’ పనులు మొదలుపెడతారు. ఆరు నెలల్లో మొదలుపెట్టే అవకాశం ఉంది. ‘స్పిరిట్‌’ పూర్తయిన వెంటనే ‘యానిమల్‌ పార్క్‌’ ఉంటుంది. 2027లో సినిమాను విడుదలల చేస్తాం’ అని భూషణ్‌కుమార్‌ తెలిపారు. మొదటి భాగం కంటే ఇందులో మరిన్ని బలమైన పాత్రలుంటాయి. గతంలో వచ్చిన చిత్రాలకంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్‌ పార్క్‌’ లక్ష్యం. ఊహించనన్ని యాక్షన్‌ సన్నివేశాలుంటాయి. రణ్‌బీర్‌ కపూర్‌ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది’’ అని సందీప్‌ వంగా తెలిపారు. ప్రస్తుతం రణ్‌బీర్‌ ‘రామాయణ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రమిది.

Updated Date - Dec 07 , 2024 | 09:06 AM