Samantha: కీర్తి సురేష్ పెళ్లి.. సమంత ఎమోషనల్ పోస్ట్

ABN , Publish Date - Dec 12 , 2024 | 05:40 PM

తాజాగా జరిగిన నటి కీర్తి సురేష్ వివాహంపై స్పందిస్తూ నటి సమంత ఎమోషనల్ అయ్యారు.

ఈరోజు నటి 'కీర్తి సురేష్' పెళ్లి గోవాలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కీర్తి సురేష్ తన 15 ఏళ్ల లాంగ్ రిలేషన్షిప్ ని పెద్దల అంగీకారంతో వివాహబంధంగా మార్చుకుంది. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ ప్రముఖులు కీర్తి సురేశ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా టాలీవుడ్ క్వీన్ సమంత స్పందిస్తూ.. ప్రేమను కురిపించారు.


కీర్తి సురేష్ తన స్నేహితుడు, వ్యాపారవేత్త 'ఆంటోనీ తట్టిల్‌'ని వివాహం చేసుకున్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ గా మారాయి. కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోలను సమంత తన స్టోరీలో షేర్ చేశారు. "ఈ ఫోటో నా హృదయాన్ని గెలుచుకుంది. ఇద్దరు బ్యూటిఫుల్ పీపుల్స్‌కి నా హృదయపూర్వక అభినందనలు. మీరిద్దరూ జీవితాంతం ప్రేమ, సంతోషాలతో గడపాలని కోరుకుంటున్న" అంటూ రాసుకొచ్చారు. NyKe Forever(కీర్తి సురేష్, ఆంటోనీ) అనే హాష్ ట్యాగ్‌తో పాటు మూడు లవ్ ఎమోజీలను జతపరుస్తూ కీర్తి సురేష్‌ని ట్యాగ్ చేశారు.

WhatsApp Image 2024-12-12 at 16.52.00.jpeg


ఇటీవల సమంత 2025లో రాశిఫలాల ప్రకారం తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌లో కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోందో తెలిపే ఒక సందేశాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. వృత్తి జీవితంలో ఎదుగుదల, ఆర్థిక స్థిరత్వంతో పాటు నూతన సంవత్సరంలో ప్రేమ, విధేయత చూపించే భాగస్వామి లభిస్తారనీ, సంతానం కలుగుతుందని ఆ పోస్ట్‌లో ఉంది. అందులో పేర్కొన్న విధంగా తన జీవితంలో మంచి జరగాలని కోరుకుంటున్నట్లు సమంత తెలిపారు. ఇందులో ఉన్న కొన్ని అంశాలు సమంత జీవితానికి దగ్గరగా ఉండడం, వృషభ, కన్య, మకర మూడు రాశుల ప్రస్తావన తేవడంతో ఆమె తన రెండో పెళ్లి గురించి చెప్పకనే చెప్పారనీ, త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారేమోనని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాతృత్వాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నట్లు సమంత తెలిపారు. ప్రస్తుతం ఆమె ‘రక్త్‌ బ్రహ్మాండ్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు.

Updated Date - Dec 12 , 2024 | 05:40 PM