Samantha: మార్పు అవసరం.. సమంత వైరల్ పోస్ట్
ABN , Publish Date - Sep 01 , 2024 | 07:31 PM
చిత్ర పరిశ్రమలో మార్పు అవసరం అని సమంత అన్నారు. వర్క్‌ప్లేస్‌ను పునరుద్థరించుకుందామంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ పెట్టారు.
చిత్ర పరిశ్రమలో మార్పు అవసరం అని సమంత (Samantha) అన్నారు. వర్క్‌ప్లేస్‌ను పునరుద్థరించుకుందామంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ పెట్టారు. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుపై (Hema committee Report) స్పందిస్తూ పని విషయంలో లింగ వివక్షత ఉండకూడదని పేర్కొన్నారు. ‘‘జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు విడుద్చ అనంతరం చిత్ర పరిశ్రమలోని మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి, తమ చేదు అనుభవాల గురించి చెబుతున్నారు. పని ప్రదేశాల్లో ఏ రూపంలో లింగవివక్ష చూపినా అది లైంగిక వేధింపుల మాదిరిగానే ఉంటుందని హేమ కమిటీ పేర్కొంది. లింగ అసమానతను అరికట్టేందుకు పారదర్శకమైన వ్యవస్థను నివేదిక సిఫార్సు చేసింది. లింగ వివక్ష లేని వాతావరణాన్ని ఇండస్ర్టీలో కల్పించేందుకు ప్రభుత్వం, మూవీ ఆర్గనైజేషన్లు కలిసి ముందుకు నడవాల్సిన సమయమిదే’’ అని ఆమె రాసుకొచ్చారు.
మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంది?ంచిన జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుపై సమంత ఇప్పటికే స్పందించారు. ఆ కమిటీ రిపోర్టును స్వాగతిస్తున్నానని రెండ్రోజుల క్రితం పోస్ట్ పెట్టారు. హేమ కమిటీకి ఏర్పాటుకు కృషి చేసిన ‘విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ని ప్రశంసించారు. టాలీవుడ్‌లో ఏర్పాటైన 2019లో ‘ది వాయిస్ ఆఫ్ విమెన్’ను గుర్తుచేస్తూ.. మహిళలసమస్యలపై పోరాడేందుకు రూపొందించిన సబ్ కమిటీ నివేదికను వెల్లడించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.