Samantha: ఆ పోలిక ఎందుకో.. సమంత వైరల్ పోస్ట్ 

ABN , Publish Date - Dec 09 , 2024 | 02:09 PM

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు సమంత(Samantha). తనకు సంబంధించిన అన్ని విషయాలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తుంటారు. ప్రేమను ఉద్దేశించి తాజాగా ఆమె పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు సమంత(Samantha). తనకు సంబంధించిన అన్ని విషయాలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తుంటారు. ప్రేమను ఉద్దేశించి తాజాగా ఆమె పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తన పెంపుడు శునకం(Pet dog) సాషాతో (Sasha) దిగిన ఓ ఫొటోని షేర్‌ చేశారు. ‘‘సాషా ప్రేమ మాదిరిగా మరొక ప్రేమ లేదు’’ అని క్యాప్షన్‌ జత చేశారు. ప్రస్తుతం ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల సిటాడెల్‌ సిరీస్‌ ఆకట్టుకున్న సామ్‌ తన సొంత బ్యానర్‌ ట్రాలాలా ఎంటర్‌టైన్‌మెంట్‌లో మా ఇంటి బంగారం’ చిత్రం ప్రకటించారు. కానీ ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఏ అప్‌డేట్‌ రాలేదు. ప్రస్తుతం ఆమె రక్త్‌ బ్రహ్మండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్‌ సిరీస్‌ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) స్ట్రీమింగ్‌ కానున్న ఈ సిరీస్‌లో అలీ ఫాజిల్‌, ఆదిత్యారాయ్‌ కపూర్‌; వామికా గబ్బి నటిస్తున్నారు. రాజ్‌ అండ్‌ డీకే సారధ్యంలో రాహి అనిల్‌ బర్వే దర్శకత్వం వహిస్తున్నారు.

Updated Date - Dec 09 , 2024 | 02:29 PM