Samantha: జ‌డ్జ్ చేయ‌కండి.. న‌న్ను బ‌త‌క‌నివ్వండి

ABN , Publish Date - Nov 06 , 2024 | 10:43 AM

హీరోయిన్ సమంత ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా త‌న బ‌రువుపై ఓ నెటిజన్ చేసిన కామెంట్‌పై సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది.

samantha

హీరోయిన్ సమంత (Samantha) ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య ఆరోగ్యానికి సంబంధించి కొన్ని టిప్స్ ఇచ్చింది సమంత. అయితే దీనిపై పెద్ద వివాదామే చేలరేగింది. మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన ట్రీట్‌మెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై రియాక్ట్ అయిన ఓ డాక్టర్ ఇలాంటివి చెప్తున్న సమంతను జైలులో పెట్టాలని రాసుకొచ్చాడు. ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు.

Samantha

దీనిపై స్పందించిన సమంత (Samantha) తన డాక్టర్ గైడెన్స్ లో మాత్రమే తను ఇవన్నీ చేశానని చెప్పుకొచ్చింది. దీనిపై పలువురు హీరోయిన్లు సైతం రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత సమంతకు ఆ డాక్టర్ సారీ కూడా చెప్పడం జరిగింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో క్యూ అండ్ ఎ సెషన్‌లో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నల‌కు స‌మాధానాలు ఇచ్చింది. ఈక్రమంలోనే ఓ నెటిజన్ సమంత బరువు గురించి ప్రశ్నించాడు. మ‌ళ్లీ బ‌రువు పెర‌గొచ్చు క‌దా అని ఓ నెటిజ‌న్ కామెంట్‌ పెట్టాడు.

Samantha Ruth Prabhu

అయితే ఆ నెటిజన్ చేసిన కామెంట్‌పై సమంత (Samantha) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సమంత మాట్లాడుతూ.. మళ్ళీ బ‌రువు గురించే ప్రశ్న. నా బ‌రువు గురించి నాకు తెలుసు. ప్రస్తుతం నేను చాలా స్ట్రిక్ట్ యాంటీ ఇన్‌ఫ్లమేట‌రీ డైట్‌లో ఉన్నాను. అందువ‌ల్లే నా బ‌రువు ఇలా ఉంది. నా ఆరోగ్య ప‌రిస్థితుల వ‌ల్ల నేను ఇలానే ఉండాలి. ఇత‌రుల‌ను జ‌డ్జ్ చేయ‌డం ఆపండి, బ‌త‌క‌నివ్వండి అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఇదిలాఉండ‌గా సమంత చివ‌ర‌గా తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషి సినిమాలో న‌టించింది. ఇక ప్ర‌స్తుతం త‌ను చేసిన సిటాడెల్ (Citadel) హనీ బన్నీ వెబ్ సిరీస్‌ నవంబర్ 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

Updated Date - Nov 06 , 2024 | 02:44 PM