Samantha: పరిశ్రమలో నన్ను 'గోల్డెన్ లెగ్' అనేవారు: సమంత
ABN , Publish Date - Mar 16 , 2024 | 06:22 PM
సమంత 'ఇండియా టుడే కాంక్లేవ్ 2024' లో ఒక స్పీకర్ గా వచ్చి మాట్లాడింది. తన కెరీర్ లో ఎక్కువ విజయాలు ఉన్నాయని, కానీ విజయాలకు ఎప్పుడూ సంతోషంగా లేను అని చెప్పింది. అలాగే రాజీ, ఊ అంటావా పాట రెండిటిలో ఏది ఇష్టమని అడిగితే ఏమి చెప్పిందో తెలుసా....
సమంత సినిమాలు ఏమీ చెయ్యడం లేదు కానీ వార్తల్లో మాత్రం ఉంటూ వస్తోంది. మయోసిటిస్ వ్యాధి వచ్చి తగ్గిన తరువాత సమంత సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉంటూ వస్తోంది. ఈరోజు 'ఇండియా టుడే కాంక్లేవ్ 2024'లో మొదటి రోజు మాట్లాడిన స్పీకర్స్ లో సమంత ఒకరు. 'ఏ మాయ చేసావే' సినిమాతో ఆరంగేట్రం చేసి, తన ప్రతిభతో ఒక్కో సినిమా నుండి అంచెలంచేలుగా ఎదుగుతూ ఈరోజు దక్షిణాదిలో అగ్ర నటిగా వెలుగొందడమే కాకుండా, బాలీవుడ్ లో కూడా తనంటే ఏంటో చూపించింది 'ఫామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్ తో.
'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా’ ఐటమ్ సాంగ్, ఫ్యామిలీ మ్యాన్ లో రాజీ పాత్ర రెండూ ఒక్కలాంటివే అని చెపుతూనే రెండింటిలో ఏది తనకి ఇష్టమైన పాత్ర అంటే రాజీ పాత్ర అని చెప్పింది సమంత. ముందు చెప్పినట్టుగా తన వెనక ఎటువండి గాడ్ ఫాదర్ లేకపోవటం, అలాగే తన చుట్టుపక్కల కూడా ఎక్కువమంది లేకపోవటం అది తనకి మంచే చేసిందని చెప్పింది సమంత. ఎందుకంటే తాను చేసిన సినిమా పాత్రల విషయంలో నిర్ణయాలు అన్నీ తన సొంతంగా తీసుకున్నవి అని చెప్పింది సమంత.
'ఊ అంటావా' పాట మొదటి సన్నివేశం చేసేటప్పుడు ఎంతో భయపడ్డాను అని చెప్పింది సమంత. ఎందుకంటే తాను ఎలా కనపడతానో, తెర మీద ఎలా ఉంటానో అని చెప్పింది. తన కెరీర్ లో ఎక్కువ విజయాలు చూశానని, చాలా తక్కువ ప్లాపులు ఉన్నాయని చెప్పింది సమంత. అయితే తన సినిమాల విజయాల్లో తన పాత్ర లేదని, దర్శకుడు, హీరో, లేదా పలనా నటుడు వలనో ఆ సినిమా విజయం సాధించింది అనే చెప్పేదాన్ని అని మీరు నా ఇంటర్వ్యూ లు చూస్తే అర్థం అవుతుంది.
కానీ ఆ విజయాలు ఏవీ నేను సరిగ్గా ఎంజాయ్ చెయ్యలేకపోయాను అని చెప్పింది సమంత. 'నా విజయాలు ఏవీ నేను ఎప్పుడూ నావి అని చెప్పుకోలేదు, వేరేవాళ్లకి ఆపాదించాను' అని చెప్పింది సమంత. తన 14 సంవత్సరాల కెరీర్ లో మొదటి సినిమా నుండీ ఎక్కువ సమయం పని చెయ్యడానికే కేటాయించాను అని, తన శరీరానికి, మెదడుకి ఎన్నడూ విశ్రాంతి ఇవ్వలేదని చెప్పుకొచ్చింది సమంత. తనని గోల్డెన్ లెగ్ అని కూడా అనేవారని చెప్పింది సమంత. కానీ ఆ విజయాలు ఏవీ కూడా నాకు సంతోషం ఇవ్వలేదని చెప్పుకొచ్చింది సమంత.
'ఖుషి' సినిమా తరువాత సమంత ఏ సినిమా కూడా ఒప్పుకోలేదు, ఒప్పుకున్న సినిమా కూడా చెయ్యలేదు. కానీ ఆమె 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్ విడుదలకి సిద్ధంగా వుంది. దీనికి రాజ్, డీకే లు దర్శకుడు, కాగా ఇందులో వరుణ్ ధావన్ కథానాయకుడు.