Samantha: సాయిపల్లవిపై సామ్ పొగడ్తల వర్షం!
ABN , Publish Date - Feb 22 , 2024 | 10:15 AM
టాలీవుడ్ టాప్ కథానాయికల్లో సమంత ఒకరు. కెరీర్ బిగినింగ్ నుంచే అగ్ర హీరోల సరసన నటించి విజయవంతమైన చిత్రాలతో అలరించారు. కథానాయికగా పీక్స్‌లో ఉన్న సమయంలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురయ్యారు.
టాలీవుడ్ టాప్ కథానాయికల్లో సమంత ఒకరు. కెరీర్ బిగినింగ్ నుంచే అగ్ర హీరోల సరసన నటించి విజయవంతమైన చిత్రాలతో అలరించారు. కథానాయికగా పీక్స్‌లో ఉన్న సమయంలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురయ్యారు. ఇప్పుడు ఆ సమస్యకు చికిత్స తీసుకునే పనిలో ఉన్నారు. ఈ కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోతున్నారు సామ్. ప్రస్తుతం మయోసైటీస్ నుంచి కోలుకుంటున్న సమంత మళ్లీ నటించడానికి సిద్థమయ్యారు. ఇప్పటికే ఆమె అంగీకరించిన సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేశారు. త్వరలోనే సామ్ నుంచి కొత్త సినిమా అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజాగా ఓ వేదికపై అతిథిగా పాల్గొన్న సామ్ మరో హీరోయిన్ సాయిపల్లవిని పొగడ్తలతో ముంచెత్తారు. "సాయి పల్లవి గొప్ప డాన్సర్ అని ఎప్పుడో తెలుసు. గతంలో ఆమె పాల్గొన్న డాన్స్ కార్యక్రమాలకు జడ్జ్‌గా కూడా వెళ్లాను. అప్పుడు సాయి పల్లవి డాన్స్‌ను చూసి దృష్టి మార్చలేక అలా చూస్తుండిపోయాను’’ అని అన్నారు.
ప్రస్తుతం సాయి పల్లవి నాగచైతన్యతో 'తండేల్' చిత్రంలో నటిస్తోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. సముద్ర జాలర్లు నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. వాస్తవ ఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తండేల్’ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్ భావిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు.