Samantha: మహిళలకు ఇప్పుడు ఆ అవకాశం ఉంది!
ABN , Publish Date - Jul 16 , 2024 | 04:32 PM
మయోసైటీస్ వ్యాధితో బాధపడుతు కోలుకున్న సమంత ప్రస్తుతం సినిమాలతో బిజీ కావడానికి సిద్దమవుతున్నారు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు తాను ఎంతో స్ట్రాంగ్ అని సామ్ అంటున్నారు.
మయోసైటీస్ వ్యాధితో బాధపడుతు కోలుకున్న సమంత (Samanta) ప్రస్తుతం సినిమాలతో బిజీ కావడానికి సిద్దమవుతున్నారు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు తాను ఎంతో స్ట్రాంగ్ అని సామ్ అంటున్నారు. గతేడాది విడుదలైన ‘ఖుషి’ (Kushi)తర్వాత సమంత మరో చిత్రంలో నటించలేదు. అనారోగ్య కారణాల వల్ల కొన్నాళ్లు విరామం తీసుకున్నారు. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ (Maa inti Bangaram) సినిమాని ప్రకటించారు. మరోవైపు, వెబ్‌సిరీస్ ‘సిటడెల్(Citadel): హనీ- బన్నీ’తో త్వరలో సందడి చేయనున్నారు. వరుణ్ ధావన్ హీరోగా రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌ని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో ఇది స్ట్రీమింగ్ కానుంది. . ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యంపై గురించి అడగగా వ్యక్తిగత, వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల గురించి చెప్పుకొచ్చారు.
మూసధోరణి ని బ్రేక్ చేయాలి..
‘ఆగస్ట్ నుంచి కొత్త సినిమా చిత్రీకరణలో పాల్గొంటా. ప్రస్తుతం అందులో నా పాత్రకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నా. కొత్త స్కిల్ నేర్చుకునే అవకాశం ఉన్న కథలనే ఎంపిక చేసుకుంటున్నా. ప్రస్తుతం హార్స్ రైడింగ్, ఆర్చరీ వంటి వాటిని అభ్యసిస్తున్నా. నా గురించి నేను చెప్పుకోవాల్సివస్తే నిత్య విద్యార్థిని అనే అంటాను. మహిళలు మంచి క్యారెక్టర్లు, పూర్తిస్థాయి పాత్రలు అడిగే పరిస్థితి ఇండస్ట్రీలో ఇప్పుడు నెలకొంది. అయితే, మూసధోరణి బ్రేక్ చేయడం ముఖ్యమని భావిస్తున్నా. ఆడియన్స్‌కు బోర్ కొట్టకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు అందించాలన్నది నా లక్ష్యం. కెరీర్ మొదలై ఎన్నో ఏళ్లు అవుతున్నా.. నేను నేర్చుకోవలసింది చాలా ఉంది. ఈ ప్రపంచంలో నాకు బాగా ఇష్టమైన చోటు.. కెమెరా ముందు నిల్చోవడమే.
అధిగమించి, ముందుకెళ్లాలి...
‘‘జీవితంలోని కొన్ని విషయాలు మార్చుకోవాలని మనలో చాలామంది అనుకుంటారు. కానీ, అది అవన్నీ సాధ్యం కావు. ఏ సవాలు ఎదురైనా దాన్ని అధిగమించి, ముందుకెళ్లాలి. అప్పుడే విజయం మనతో ఉంటుంది. ఆ స్ఫూర్తితోనే నేను ఇక్కడివరకూ వచ్చా. గత మూడేళ్లలో నేనూ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. ఆధ్యాత్మిక చింతన నాలో మంచి మార్పు తీసుకొచ్చింది. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా ప్రభావం చూపింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలామందికి చిన్న వయసులోనే అనారోగ్యం దరి చేరుతోంది. మానసికంగానూ బాధ పడుతున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక చింతన అవసరం ఎంతో ఉంది. అది శక్తినిచ్చే మార్గమని నేను బలంగా నమ్ముతున్నా’’.