Samantha: కొద్దిమందిపై ప్రభావం చూపినా సంతోషమే కదా!

ABN , Publish Date - Apr 27 , 2024 | 02:39 PM

సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన సమంత (Samantha) ప్రస్తుతం యూట్యూబ్‌ వేదికగా పాడ్‌కాస్ట్‌ (Podcast) సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. అందులో  భాగంగా తాజా ఎపిసోడ్‌లో తన అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నటిగా ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం చిన్న విషయం కాదు.

Samantha:  కొద్దిమందిపై ప్రభావం చూపినా సంతోషమే కదా!

సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన సమంత (Samantha) ప్రస్తుతం యూట్యూబ్‌ వేదికగా పాడ్‌కాస్ట్‌ (Podcast) సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. అందులో  భాగంగా తాజా ఎపిసోడ్‌లో తన అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నటిగా ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం చిన్న విషయం కాదు. నా ఫ్యాన్స్‌లో చాలామందికి వినోదం, ఫ్యాషన్‌, మేకప్‌పై ఆసక్తి ఎక్కువ. వాళ్లను చూసి ఎన్నో విషయాలపై నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. వారి వల్ల కొత్త అంశాలపై అవగాహన వచ్చింది. నా మాటలు కొద్దిమందిపై ప్రభావం చూపినా సంతోషమే కదా! మంచి మాటలతో కొంతమందిలో అయినా మార్పు తీసుకురాగలిగితే అంతకు మించి నేనేం కోరుకోను. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట నా మాటను గౌరవించే వాళ్లు ఉండడం అదృష్టం(Samantha about Fans). నేను నా మనసుకు నచ్చిందే చేస్తాను.

Samantha-2.jpg

 ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది సరైనదా.. కాదా అని బాగా ఆలోచిస్తాను. మానసికంగా ప్రశాంతంగా లేకపోతే శారీరకంగా కూడా ఫిట్‌గా ఉండలేరు. అందుకే నేనెప్పుడు మెంటల్‌ హెల్త్‌కు ఇంపార్టెన్స ఇస్తాను. దానికోసం అవసరమైన వర్కవుట్స్‌ చేస్తుంటాను’ అని అన్నారు. ప్రస్తుతం ఆమె నటించిన యాక్షన్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో సమంతతోపాటు వరుణ్‌ ధావన నటించారు. త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ‘సిటడెల్‌: హనీ-బన్నీ’ పేరుతో స్ట్రీమింగ్  కానుంది.

Read More: Tollywood, Cinema News

Updated Date - Apr 27 , 2024 | 02:41 PM