Samantha: సమంత పోస్ట్‌కి కారణం అదేనా.. ఇన్‌డైరెక్ట్ సెటైరా?
ABN , Publish Date - Dec 06 , 2024 | 11:06 AM
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఏ పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా తన తండ్రి మరణించడంతో సోషల్ మీడియాలో కాస్త స్లో అయింది. అయితే బుధ/గురువారం ఆమె చేసిన రెండు పోస్ట్ లు నెట్టింట విపరీతంగా వైరల్ ( అవుతున్నాయి
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత (Samantha) ఏ పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా తన తండ్రి మరణించడంతో సోషల్ మీడియాలో కాస్త స్లో అయింది. అయితే బుధ/గురువారం ఆమె చేసిన రెండు పోస్ట్ లు నెట్టింట విపరీతంగా వైరల్ (Samantha post) అవుతున్నాయి. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం చేసుకున్న తరుణంలో ఆమె పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. 'ఫైట్ లైక్ ఎ గర్ల్’ (Fight like a Girl) . అంటూ ఓ వీడియో ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆమె ఎక్స్ హజ్బెండ్ నాగచైతన్య, శోభితల పెళ్లి ఇటీవల జరిగింది. ఈ సమయంలో సామ్ పోస్ట్ చేసిన వీడియో, హ్యాష్ ట్యాగ్ అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే... "ఓ అమ్మాయి, అబ్బాయి కుస్తీ పడుతుంటారు. అయితే అబ్బాయిలో ఓడించేస్తాను అనే నమ్మకం ఉంటుంది. అమ్మాయి కాస్త భయంగానే బరిలోకి దిగుతుంది. కానీ చివరికి అమ్మాయే గెలుస్తుంది. దీంతో ఓడిపోయిన అబ్బాయి ఏడుస్తూ ఉంటాడు. ఈ వీడియోను షేర్ చేసి.. దానికి సమంత Fight like a Girl అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది.
నాగచైతన్య (naga chaitanya), శోభిత (Sobhitha Dhulipala) పెళ్లి నేపథ్యంలో సమంత ఏమి పోస్ట్ పెడుతుందా అనే క్యూరియాసిటీ నెటిజన్లలో కలిగింది. అయితే ఆమె షేర్ చేసిన ఈ వీడియోను, పెట్టిన హ్యాష్‌ల ట్యాగ్‌లను స్క్రీన్ షాట్ తీసి.. దానిని మీమ్స్ చేస్తున్నారు. ఎవరికైనా ఇన్‌డైరక్ట్ కౌంటర్? ఇస్తున్నావా? సామ్ (samantha) అని కొందరు పోస్ట్ చేస్తుంటే.. మరికొందరు కావాలనే ఈ పోస్ట్ పెట్టిందంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇలాంటి పోస్ట్‌లు సమంత తరచూ చేస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పోస్ట్‌కు కారణం.. నాగచైతన్య, శోభితల పెళ్లి గురించే అని నెటిజన్లు భావిస్తున్నారు.
అంతే కాదు సామ్ మరో పోస్ట్ కూడా చేశారు. తాజాగా ఆమె నటించిన 'సిటాడెల్' (Citadel) ఇండియన్ వెర్షన్‌కు చక్కని స్పందన రావడం ఆనందంగా ఉందని తెలిపింది. దర్శక ద్వయం ఆర్ అండ్ డీకే సిటాడెట్ హాలీవుడ్ మేకర్స్ రూస్సో బ్రదర్స్‌ను కలిసి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడం మరింత ఆనందంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆమె రూస్సో బ్రదర్స్‌తో రాజ్ అండ్ డీకే దిగిన ఫొటోను షేర్ చేసి ‘‘వాట్ ఎ జర్నీ. ఇన్‌క్రెడిబుల్ రాజ్ డీకేలతో కలిసి సిటాడెల్ హనీ బన్నీలో పని చేయడం చాలా గౌరవంగా ఉంది అని రాసుకొచ్చారు. అంతే కాదు ఈ సిరీస్‌కు హాలీవుడ్‌లో క్రిటిక్ ఛాయిస్‌లో నామినేషన్‌లో ఉండటం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. అయితే తాజాగా ఆమె చేసే ప్రతి పోస్ట్ నాగచైతన్య, శోభితల పెళ్లి గురించి ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్స్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.