Oka Pathakam Prakaram: ‘ఒక పథకం ప్రకారం’.. రాబోతున్న పూరి తమ్ముడు! హిట్ పడేనా?
ABN , Publish Date - Feb 19 , 2024 | 02:42 PM
సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్, శృతీ సోధి హీరోహీరోయిన్లుగా వినోద్ విజయన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’ విడుదలకు సిద్ధమవుతోంది.
వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ బ్యానర్స్ పై సాయిరామ్ శంకర్ (Sai Raam Shankar), అశీమా నర్వాల్ (Ashima Narwal), శృతీ సోధిలు హీరోహీరోయిన్లుగా ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న వినోద్ విజయన్ (Vinad Vijayan) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’ (Oka Pathakam Prakaram). వినోద్ విజయన్, గార్లపాటి రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని మార్చి లో థియేటర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.
ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు వినోద్ విజయన్ మాట్లాడుతూ.. ‘‘విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ థ్రిల్లర్ సినిమాలో హీరో సాయిరామ్ శంకర్ విభిన్నమైన, పవర్ ఫుల్ అడ్వకేట్ పాత్రలో కనిపిస్తారు. సముద్రఖని (P.samuthirakani) పోలీస్ ఆఫీసర్ పాత్రలో అత్యద్భుతంగా నటించారు. గోపిసుందర్ (Gopi Sundar) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందన్నారు. రాహుల్ రాజ్ (Rahul Raj) అద్భుతమైన రెండు పాటలు అందించగా, సిధ్ శ్రీరాం ఆ పాటలకు ప్రాణం పోశారన్నారు.
ఇప్పటికే టిప్స్ మ్యూజిక్ ద్వారా విడుదలై మొదటి పాట "ఒసారిలా రా" మంచి రెస్పాన్స్ అందుకుందని, డి.ఓ.పి రాజీవ్ రవి, ఆర్ట్ డైరెక్టర్: సంతోష్ రామన్, సౌండ్: ఎస్ రాధా కృష్ణన్, మేకప్: పట్టణం రషీద్, పట్టణం షా, ఇలా ఐదుగురు నేషనల్ అవార్డు విన్నర్స్ ఈ చిత్రానికి టెక్నిషియన్స్ గా పనిచేశారన్నారు.