Sai Pallavi's Intro: సాయి ప‌ల్ల‌వి.. ఈ సారి కంట‌త‌డి పెట్టించేలా ఉందిగా!

ABN , Publish Date - Sep 27 , 2024 | 12:54 PM

శివకార్తికేయన్, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన కొత్త చిత్రం అమ‌ర‌న్‌. ఈ దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి సాయి ప‌ల్ల‌వి పోషించిన ఇందు ముకుంద్‌ ఇంట్రోను ప‌రిచ‌యం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు.

amaran

శివకార్తికేయన్ (Sivakarthikeyan), సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi) జంట‌గా విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan)కు చెందిన RKFI అండ్ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం అమ‌ర‌న్‌. నిజ జీవిత ఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కించిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఈ దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి శివ కార్తికేయ‌న్ లుక్‌, ఓ పాట‌ను రిలీజ్ చేయ‌గా తాజాగా సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi) పోషించిన ఇందు ముకుంద్‌ ఇంట్రోను ప‌రిచ‌యం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు.

GYdsuhubgAExKwT.jpeg

ఈ వీడియో సోష‌ల్‌మీడియాలో, యూట్యూబ్‌లో బాగా వైర‌ల్ అవుతుంది. ఈ ఇంట్రోలో మేజ‌ర్ ముకంద్ వీర మ‌ర‌ణానంత‌రం భార్య‌ ఇందు (సాయి ప‌ల్ల‌వి)కి ప్ర‌భుత్వం పుర‌స్కారం అంద‌జేసే నేప‌థ్యంలో ప్రారంభ‌మై ముకుంద్‌తో ఇందు, ప్రేమ‌, సాన్నిహిత్యం కుటుంబం గురించిన స‌న్నివేశాలు ఉన్నాయి. ఈ ట్రైల‌ర్‌ను చూశాక సినిమాలో సాయి ప‌ల్ల‌వి త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను బాగానే కంట‌త‌డి పెట్టిస్తుంద‌నేలా ఉంది.

GYdsBfobUAAqaEZ.jpeg

ఇదిలా ఉండ‌గా ఈ ‘అమరన్’ మూవీ తెలుగు ఏపీ, టీఎస్‌ల థియేట్రికల్ హక్కులను హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అతని సోదరి నిఖితారెడ్డిల శ్రేష్ఠ్ మూవీస్ సొంతం చేసుకుంది. ఇంతకు ముందు ఈ సంస్థ కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. రాబోయే దీపావళి స్పెషల్‌గా అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ‘ఇండియాస్ మోస్ట్’ అనే పుస్తకంలోని ‘మేజర్ వరదరాజన్’ కథ ఆధారంగా రూపొందించబడుతోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

GYdwZTKWwAAoR5M.jpeg

Updated Date - Sep 27 , 2024 | 12:54 PM