Sai Durgha Tej: సాయి దుర్గా తేజ్‌ని ఎగ్జైట్ చేస్తున్న డిసెంబర్.. ఉపేంద్ర 'యూఐ'

ABN , Publish Date - Dec 19 , 2024 | 02:41 PM

సాయి దుర్గా తేజ్‌ సినిమా రిలీజ్ లేకపోయిన ఆయన డిసెంబర్ రిలీజ్‌ల కోసం తెగ ఎగ్జైట్ అవుతున్నారు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక్క మూవీ కూడా లేకున్నా ఆయనను అంతలా ఇంప్రెస్ చేసిన మూవీస్ ఏంటంటే..

'పుష్ప 2' మేనియా కాస్త నెమ్మదించడంతో అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ కు సిద్ధమయ్యాయి. ప్రధానంగా ఉపేంద్ర 'యూఐ' సినిమాతో పాటు అల్లరి నరేష్ 'బచ్చల మల్లి', విజయ్ సేతుపతి 'విడుదల 2', మహేష్ వాయిస్ అందిస్తున్న 'ముఫాసా: ది లయన్ కింగ్' సినిమాలతో పాటు ప్రియదర్శి సారంగపాణి జాతకం, వెన్నెల కిషోర్ 'శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్' మరికొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో సాయి దుర్గా తేజ్ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.


రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలకు మద్దతు తెలుపుతూ ఆయన పోస్ట్ పెట్టారు. ప్రధానంగా ఉపేంద్ర 'యూఐ' గురించి రాస్తూ.. 'విప్లవాత్మకంగా ఆసక్తిని రేకెత్తిస్తూ రా ప్రయత్నం చేస్తున్న ఉపేంద్ర గారు బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని కోరుకుంటున్న' అని రాసుకొచ్చారు. ఉపేంద్రతో పాటు హీరోయిన్ రీష్మా, ప్రొడ్యూసర్లని ట్యాగ్ చేసిన ఆయన మొత్తం మూవీ టీమ్‌కి అభినందనలు తెలిపారు.


నెక్స్ట్.. 'విడుదల' సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన 'విడుదల 2' సినిమా గురించి రాస్తూ.. ది బెస్ట్ 'విజయ్ సేతుపతి', వెట్రిమారన్ లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మహేష్ బాబు, సత్యదేవ్, బ్రహ్మానందం వాయిస్ అందిస్తున్న 'ముఫాసా: ది లయన్ కింగ్' సినిమాకి అల్ ది బెస్ట్ చెప్పారు.


ఇక అల్లరి నరేష్ 'బచ్చల మల్లి' గురించి ప్రత్యేకమైన పోస్ట్ రాసుకొచ్చారు.. "బచ్చల మల్లి కంటెంట్ నన్ను ఎంతో ఆకట్టుకుంది. నరేష్ అన్న 'మల్లి' పాత్రలో నీ రానెస్, ఇంటెన్సిటీ, హార్డ్ వర్క్ కి దగ్గ ప్రతిఫలం లభిస్తుంది అని ఆశిస్తున్నా. 'నేను', 'గమ్యం', 'నాంది' సినిమాల మాదిరిగానే ఇది నీ కెరీర్‌లో నిలిచిపోయే మరో మైలురాయి అని ఆశిస్తున్నాను. ఇక నా డైరెక్టర్ సబ్బు నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్న, నీ హార్డ్ వర్క్‌కి మంచి ఫలితం లభిస్తుంది" అని ట్వీట్ చేశారు. అలాగే ఈ సినిమాల పనిచేస్తున్న ప్రధాన టెక్నీషయన్స్‌తో పాటు నిర్మాతలను ట్యాగ్ చేశారు.

Updated Date - Dec 19 , 2024 | 02:43 PM