SDT 18: మారణహోమానికి సిద్ధంకండి.. సాయి ధరమ్ తేజ్
ABN , Publish Date - Dec 07 , 2024 | 11:44 AM
మెగా హీరో సాయి దుర్గ తేజ్ మారణహోమానికి సిద్ధమవమని పిలుపునిచ్చారు. ఈ సారి యుద్ధం హై-ఆక్టేన్‌తో కూడుకొని ఉంటుందని అన్నారు.
మెగా హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) ‘విరూపాక్ష’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత, తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18 చేస్తున్నారు. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘హనుమాన్’ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్ నుండి అదిరిపోయే అప్డేట్ బయటకొచ్చింది.
ఇప్పటికే ఈ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న జగపతి బాబు, సాయి కుమార్ ల పోస్టర్లను విడుదల చేసి మేకర్స్ మంచి బజ్ క్రియేట్ చేశారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కీలక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో కేవలం సాయి ధరమ్ తేజ్ చేతిని, రక్తంతో తడిసిన ఖడ్గాన్ని చూపించారు. అలాగే డిసెంబర్ 12న carnage(మారణహోమం) స్టార్ట్ అంటూ కీలక అప్డేట్ ప్రకటించేశారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
#SDT18 లో సాయి దుర్గ తేజ్ మునుపెన్నడూ చేయని పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. మోస్ట్ ట్యాలెంటెడ్ ఐశ్వర్య లక్ష్మి ఈ హై-ఆక్టేన్, పీరియడ్-యాక్షన్ డ్రామాలో సాయి దుర్గ తేజ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. విలక్షణ నటుడు జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ బి. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా సినిమాగా విడుదల చేయనున్నారు.