Sai dharam tej: ఆ రెండు లేనిదే జీవితాన్ని నిర్వచించలేము!
ABN , Publish Date - Jan 09 , 2024 | 12:50 PM
కొన్ని సందర్భాల్లో జీవితం మిమ్మల్ని కిందకు పడేసిన మళ్లీ పైకి లేపేందుకు మార్గం చూపుతుంది’’ అంటున్నారు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్.
"కొన్ని సందర్భాల్లో జీవితం మిమ్మల్ని కిందకు పడేసిన మళ్లీ పైకి లేపేందుకు మార్గం చూపుతుంది’’ అంటున్నారు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. రోడ్డు ప్రమాదం కారణంగా కొన్నాళ్లు సినిమాకు దూరంగా ఉన్న ఆయన గత ఏడాది 'విరూపాక్ష’తో భారీ విజయం అందుకున్నాడు. ఆ విజయం గురించి తన అభిప్రాయం అడగగా సినిమా సక్సెస్ కంటే యాక్సిడెంట్ తర్వాత తన జీవితం ఎంతో బావుందని పేర్కొన్నారు తేజ్. ఇటీవల జరిగిన గలాటా ప్లస్ మెగా తెలుగు రౌండ్ టేబుల్‌లో శ్రుతీహాసన్, శ్రియారెడ్డి, నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు తరుణ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా సాయిధరమ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వేదికగా తన జీవితంలో చవిచూసిన ఎత్తుపల్లాల గురించి ప్రస్తావించారు. ఓ మార్గంలో వెళ్తునప్పుడు ఎత్తు పల్లాలు సహజం. ఆ రెండు లేకుండా జీవితాన్ని నిర్వచించలేము. ముఖ్యంగా రెండున్నర ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం గురించి చెప్పుకొచ్చారు. ప్రమాదానికి ముందు, తర్వాత అని రివ్యూ చేసుకుంటే తనలో ఎంతో మార్పు వచ్చిందని తేజ్ చెబుతుంటారు.
అదే నిజమైన విజయం...
ప్రమాదం నుంచి కోమాలోకి వెళ్లి కోలుకున్నాక అభిమానుల నుంచి వచ్చిన ఒక్కో మెసేజ్ చదువుతుంటే ప్రేక్షకులు నాపై పెట్టుకున్న అభిమానం ఏంటో తెలిసింది. ‘విరూపాక్ష’ సక్సెస్ కంటే అభిమానుల చూపించిన ప్రేమే పెద్ద సక్సెస్‌గా అనిపించింది. అదే నిజమైన విజయంగా భావించాను.
విజిల్ వేసే అవకాశం అలా...
తన మేనమామ పవన్ కల్యాణ్‌కి లెగో ఆడటమంటే ఇష్టమని, తను ఎప్పుడన్నా తనకు లెగో కొనుక్కుంటే పవన్ కల్యాణ్‌నికి కూడా ఒకటి కొనుక్కొని తీసుకెళ్లేవారని చెబుతూ తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకున్నారు పవన్ కల్యాణ్ తనను లెగో ఆడటానికి తరచుగా పిలిచేవారని తెలిపారు తేజ్. నిర్మాత శోభు యార్లగడ్డ ఫిల్మ్ ప్లానింగ్ టెక్నిక్స్ చాలా బాగుంటుంది. ఏ సినిమాకు అయినా ప్లానింగ్ చాలా ముఖ్యం. నా రిపబ్లిక్ సినిమా సమయంలో స్టోరీ బోర్డింగ్.. షాట్ డివిజన్ వంటి ప్లాన్స్ వల్ల చాలా పనులు అనుకున్న సమయం కంటే సగం సమయంలో పూర్తి చేయడానికి సహాయపడతాయి’’ అని అన్నారు.
అదే తేడా..
అంతే కాదు భారతీయ చిత్రాలు, హాలీవుడ్ చిత్రాల మధ్య వ్యత్యాసాన్ని గురించి ఆయన మాట్లాడారు. భారతీయ చిత్రాల్లో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని.. స్లో మోషన్‌లో సీన్లు ఇండియన సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని తేజ్ చెప్పారు. స్లో మోషన్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఎమోషన్స్ పండిస్తాయని ముఖ్యంగా హీరో ఎంట్రీ సీన్లు స్లో మోషన్ లో ఉండడం ద్వారా ఫ్యాన్స్ విజిల్ వేసే అవకాశం దక్కుతుందని చెప్పారు.
స్టార్స్ ఆలోచన అదే
కరోనా, లాక్‌డౌన్ తర్వాత ప్రేక్షకులు ఓటీటీల ద్వారా ప్రపంచ సినిమాలు చూసేశారు. ఇప్పుడు వాళ్ల ఆలోచనా ధోరణి మారింది. ప్రేక్షకులు అన్ని భాషల్లో సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు స్టార్స్ ఎన్ని సినిమాలు చేస్తున్నాం అనే దానికంటే ఎలాంటి సినిమా చేస్తున్నాం. ఎంతమందిని ఆకట్టుకోగలిగారు అన్నది చూస్తున్నారు. తాజాగా సందీప్ రెడ్డి వంగా తీసిన ‘యానిమల్’ చూశానని చెప్పిన తేజ్ అలాంటి బోల్డ్ స్క్రిప్ట్ తన దగ్గరకు వచ్చుంటే తప్పకుండా చేసేవాడినని అన్నారు. అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. అలాంటి బోల్డ్ పాత్ర పోషించడానికి ధైర్యం కావాలని, ధైర్యంగా ఆ పాత్రలు చేసిన రణబీర్ కపూర్, అనిల్ కపూర్.. రష్మిక మందన్నలను ప్రశంసించారు తేజ్.