Renu Desai: మీకు కొంచెమైనా బుద్ది ఉందా? ఇంకా ఎంతకాలం ఇలా!

ABN , Publish Date - Jun 17 , 2024 | 04:20 PM

రేణూ దేశాయ్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే. ఇన్స్టా వేదికగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తుంటారు. ఆమె ప్రతి పోస్ట్‌కు పవన్  అభిమానులు రియాక్ట్‌ అవుతుంటారు.

Renu Desai: మీకు కొంచెమైనా బుద్ది ఉందా? ఇంకా ఎంతకాలం ఇలా!


రేణూ దేశాయ్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే. ఇన్స్టా వేదికగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తుంటారు. ఆమె ప్రతి పోస్ట్‌కు పవన్  అభిమానులు రియాక్ట్‌ అవుతుంటారు. కొందరు పాజిటివ్‌గా కామెంట్స్‌ చేస్తే,  మరికొందరు ఆమెకి చిరాకు కలిగించే మెసేజ్‌లు పెడుతుంటారు. తాజాగా  పవన్   కల్యాణ్‌ గెలుపు, ప్రమాణ స్వీకారం సందర్భంగా  శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌ పెట్టారు. అలాగే తన ఇంట్లో జరిపిన పండుగ, హోమం గురించి చెప్పింది. ప్రత్యేక పూజల సమయంలో ప్రసాదాలు స్వయంగా తానే తయారు చేస్తానని, అలా చేయడం ఎంతో ఇష్టమని రేణూ దేశాయ్‌ చెప్పుకొచ్చింది. అయితే ఆమె షేర్‌ చేసిన వీడియో పై పవన్‌ ఫ్యాన్స్‌ రియాక్ట్‌ అయ్యారు. ‘‘వదినగారు మీరు కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టుంటే బాగుండేది. ఒక దేవుణ్ణి పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు. కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఏది ఏమైనా విధి అంతా డిసైడ్‌ చేస్తుంది. ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు. మిమ్మల్ని మిస్‌ అవుతున్నాం వదిన’ అంటూ కామెంట్‌ చేశాడు.

Renudeai.jpg

ఆ నెటిజన్స్ పై రేణూ దేశాయి మండిపడ్డారు. "మీకు కొంచెమైనా బుద్ది ఉంటే ఇలా అనేవారు కాదు.. ఆయన నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. నేను కాదు.. దయచేసి ఇలాంటి కామెంట్స్‌ చేసి నన్ను టార్చర్‌ చేయవద్దు.   మరో నెటిజన సూపర్‌ అమ్మ మీరు.. అన్న దగ్గర లేకపోయినా పూజలు చేస్తున్నారు’ అని కామెంట్‌ చేయగా దానికీ  రేణూ దేశాయి ఫైర్‌ అయ్యారు. అన్న దగ్గర లేకపోయినా? .. అంటే అర్థం ఏంటీ? నాకు నా సొంత లైఫ్‌ ఉండదా..? మీరు ఇలాంటి కామెంట్స్‌ పెట్టి నన్ను బాధపెడుతున్నారు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - Jun 17 , 2024 | 04:20 PM