Ramam Raghavam: తండ్రికొడుకుల ఎమోషనల్‌ జర్నీ.. ‘రామం రాఘవం’

ABN , Publish Date - Sep 15 , 2024 | 08:50 AM

ప్రముఖ దర్శకనటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘రామం రాఘవం’. ప్రముఖ తెలుగు కమెడియన్‌ ధన్‌రాజ్ తొలిసారి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇటీవ‌ల విడుద‌లైన పాట తెలుగు, త‌మిళ భాష‌ల్లో బాగా వైరల్ అవుతోంది.

Ramam Raghavam

ప్రముఖ దర్శకనటుడు సముద్రఖని (P.samuthirakani) ప్రధాన పాత్రలో తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘రామం రాఘవం’. ప్రముఖ తెలుగు కమెడియన్‌ ధన్‌రాజ్ (Dhanraj) తొలిసారి దర్శకత్వం వహించారు. పృథ్వి పోలవరపు నిర్మాత. తండ్రికొడుకుల ఎమోషనల్‌ జర్నీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 5వ తేదీ గురుపూజోత్సవం సందర్భంగా తండ్రికుమారుల మధ్య అనుబంధం, భావోద్వేగానికి సంబంధాన్ని వివరిస్తూ సాగే పాట విడుదల చేశారు.

GXB49aZaMAAEy3s.jpeg

ఈ మెలోడీ సాంగ్‌ విడుదలైన కొన్ని గంటల్లోనే తెలుగు, త‌మిళ భాష‌ల్లో బాగా వైరల్‌ కావడం గమనార్హం. స్లేట్‌ పెన్సిల్‌ స్టోరీస్‌ పతాకంపై నిర్మాత ప్రభాకర్‌ ఆరిపాక (Prabhakar Aaripaka) సమర్పణలో పృథ్వి (prudhvi) పొలవరపు నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ ద్విభాషా చిత్రంలో తండ్రి తనయుల మధ్య ఎఫెక్షన్‌ను ప్రధానంగా ప్రస్తావించారు. కాగా, ఈ చిత్రంలో మోక్ష (Mokksha), హరీష్‌ ఉత్తమన్‌, సత్య, పృథ్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్‌ రాఘవ, రచ్చరవి, ఇంటూరి వాసు తదితరులు నటించారు. అరుణ్‌ చిలువేరు (Arun Chiluveru) సంగీతం. తమిళం, తెలుగు భాషల్లో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

Updated Date - Sep 15 , 2024 | 08:50 AM