Love Reddy: రెబల్‌ స్టార్ సపోర్ట్.. యూనిట్ పిచ్చ హ్యాపీ

ABN , Publish Date - Oct 20 , 2024 | 06:14 PM

ఈ మధ్యకాలంలో చిన్న చిత్రాలకు స్టార్ హీరోలు ఇస్తున్న సపోర్ట్ టాలీవుడ్ అంతా మాట్లాడుకునేలా చేస్తుంది. తాజాగా విడుదలైన ‘లవ్ రెడ్డి’ అనే చిత్రానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన మద్దతును అందించారు. ఈ సినిమా గురించి ప్రభాస్ ఏమన్నారంటే..

Love Reddy Movie Hero and Heroine

ఈ మధ్యకాలంలో చిన్న చిత్రాలకు స్టార్ హీరోలు ఇస్తున్న సపోర్ట్ టాలీవుడ్ అంతా మాట్లాడుకునేలా చేస్తుంది. ముఖ్యంగా మహేష్ బాబు (Mahesh Babu) లాంటి వారు.. సినిమా చూసి మరీ.. వాటికి రివ్యూ ఇస్తూ.. ప్రమోట్ చేస్తున్నారు. తమ వంతు బాధ్యతగా మద్దతు ఇచ్చేందుకు పెద్ద హీరోలు ఇలా ముందుకు వస్తుండటం స్వాగతించాల్సిన అంశం. ఇక ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), ఓ చిన్న చిత్రానికి మద్దతు ఇస్తూ.. ఇన్‌స్టాలో టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆ సినిమా మరేదో కాదు.. ‘లవ్ రెడ్డి’ (Love Reddy).

Also Read- The Substance: మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ఎలా తీశార్ర బాబు ఈ సినిమా! స్ట్రీమింగ్ ఎక్క‌డ అంటే

‘లవ్ రెడ్డి’ చిత్రానికి సంబంధించి ఎన్నో మంచి విషయాలు తన దృష్టికి వచ్చాయని, ఇటీవల కాలంలో విడుదలైన ప్రేమ కథల్లో ఈ సినిమా మంచి చిత్రంగా నిలువడం ఆనందంగా ఉందని ప్రభాస్ తెలిపారు. ఈ మేరకు ఇన్ స్టాలో తన అభిమానుల కోసం ‘లవ్ రెడ్డి’ చిత్ర ట్రైలర్‌ను షేర్ చేస్తూ ఆ చిత్రానికి అండగా నిలవాలని ప్రభాస్ కోరారు. ఇప్పటికే ఈ చిత్రానికి యువ నటుడు కిరణ్ అబ్బవరం ముందుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో 4 స్పాన్సర్ షోలు వేసి మద్దతు ఇవ్వగా.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంటి అగ్ర హీరో ‘లవ్ రెడ్డి’ చిత్రానికి అండగా నిలవడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ప్రభాస్ ‘లవ్ రెడ్డి’ వంటి చిత్రానికి మద్దతుగా నిలవడం పట్ల సామాజిక మాధ్యమాల్లో సైతం నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘లవ్ రెడ్డి’ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.


Prabhas.jpg

గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘లవ్ రెడ్డి’. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు‌గా నటించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ‘లవ్ రెడ్డి’ సినిమా ఈ నెల 18వ తేదీన థియేటర్లలో విడుదలైన మంచి స్పందనను రాబట్టుకుంటోంది.

Also Read- Salman Khan: రావాలి అనిపించడం లేదు.. ఫ్రస్ట్రేషన్‌లో సల్మాన్ ఏమన్నాడో తెలుసా

Also Read- Ani Master: జానీ నిరపరాధి అని తేలితే ఏం చేస్తారు..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 20 , 2024 | 06:14 PM