Ravi Teja: 'మిస్టర్ బచ్చన్' ఇరగదీస్తుంది

ABN , Publish Date - Aug 13 , 2024 | 07:29 PM

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఆగస్టు15న విడుదల కానుంది. ఈ క్ర‌మంలో కర్నూలులో మిస్టర్ బచ్చన్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు.

mr bachhan

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్' అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)నటించింది. మిస్టర్ బచ్చన్ ఆగస్టు15న స్వాతంత్య్ర‌ దినోత్సవం రోజున విడుదల కానుంది. ఆగస్ట్ 14 సాయంత్రం నుంచి ప్రిమియర్స్ ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూల్ లో మిస్టర్ బచ్చన్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు.

GU2o4U0WwAAmBhy.jpeg

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ.. ఈ సినిమా అంత కలర్ ఫుల్‌గా ఉండబోతోంది. ఈ సినిమాలో నేను, భాగ్యశ్రీ అందంగా కనిపించబోతున్నాం. మిక్కీ జే మేయర్ నుంచి ఇలాంటి మ్యూజిక్ వస్తుందని ఊహించలేదు. ఒకరకంగా షాక్ ఇచ్చినట్లే. ఫస్ట్ టైం ట్యూన్స్ వినిపించినపుడు ఇది మిక్కీనా అనిపించింది.

GU3cZUpXMAA-9wG.jpeg

విశ్వ గారు, వివేక్ గారు బాగా దగ్గర. వారు ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉండాల‌న్నారు. ఇక భాగ్యశ్రీ ఇప్పటికే ఊపు ఊపేస్తుంది. తనే డబ్బింగ్ చెప్పింది. సినిమాలో మీ అందరికీ ఇంకా నచ్చుతుందన్నారు. ఈ సినిమాకు హరీష్ చాలా హార్డ్ వర్క్ చేశాడు ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలన్నారు. మిస్టర్ బచ్చన్ 14వ తారీకు సాయంత్రం నుంచి ఇరగదీయబోతోందన్నారు.


GU2SUMaboAAG9Hz.jpeg

డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ చూస్తుంటే కత్తిలాంటి కుర్రాళ్ళు కర్నూల్ లోనే ఉన్నారా అనిపిస్తుంది. నా రైటింగ్ టీం, భాస్కర్ బట్ల,వనమాలి, కాసర్ల శ్యాం, సాహితి గారికి థాంక్ యూ. ఈ సినిమాకి ప్రవీణ్ వర్మ అద్భుతమైన డైలాగులు రాశారు. ఆగస్ట్ 15 మా గురువు గారు పూరి జగన్నాథ్ గారు, రామ్ డబుల్ ఇస్మార్ట్ వస్తోంది. ఈ రెండు సినిమాలు చూడండి. రెండు సినిమాలని బ్లాక్ బస్టర్ చేయండన్నారు.

GU3cZUoXkAAtPsJ.jpeg

భాగ్యశ్రీ హార్డ్ వర్కింగ్ హీరోయిన్. తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందన్నారు. గ‌తంలో మిరపకాయ్ టైటిల్ రవితేజ గారే పెట్టారు. మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టింది కూడా ఆయనే. జీవితాన్ని ఇచ్చి, సినిమాలు ఇచ్చి, ఆఖరికి టైటిల్స్ కూడా ఇచ్చార‌న్నారు (నవ్వుతూ). ఆయన లేకుండా నా ఫిల్మ్ కెరీర్ ని ఊహించలేను. వన్ మంత్ లో నాలుగు చార్ట్ బస్టర్ సాంగ్స్ చేశారు మిక్కీ జే మేయర్. మా ఇద్దరిదీ డెడ్లీ కాంబినేషన్. మా సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ థాంక్ యూ సో మచ్. మిస్టర్ బచ్చన్ రిపీట్ ఆడియన్స్ ఉండే సినిమా.'అన్నారు.

GU3ZUtfakAAD0aO.jpeg

హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. మూవీ రిలీజ్ కి ముందే మీరంతా ఎంతో ప్రేమని చూపించారు. అందరికీ థాంక్ యు. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. నాపై నమ్మకంతో ఇంత మంచి రోల్ ఇచ్చిన హరీష్ గారికి థాంక్ యూ. మాస్ మహారాజా రవితేజ గారు చాలా సపోర్ట్ చేశారు. మాస్ మహారాణిలానే చూశారు. ఆయన నా ఫస్ట్ కో స్టార్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు.

GU3cZUnXoAA7bBI.jpeg

ప్రొడ్యూసర్ టి.జి.విశ్వ ప్రసాద్, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మూడోసారి కలసి పని చేసే అవకాశం ఇచ్చిన రవితేజ గారికి థాంక్ యూ వెరీ మచ్. హరీష్ శంకర్ తను చేస్తున్న సినిమా నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకొని ఈ సినిమా చేయడానికి పర్మిషన్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి థాంక్ యూ. మిస్టర్ బచ్చన్ ఇప్పటివరకూ చూసిన పాటలే కాకుండా ఇంకా ఎక్స్ట్రా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను' అన్నారు.

Updated Date - Aug 13 , 2024 | 07:29 PM