Eagle: మారింది తేదీ మాత్రమే.. మాసోడి మార్క్ కాదు..
ABN , Publish Date - Jan 05 , 2024 | 11:38 AM
మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో తెరకెక్కిన యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయాల్సి ఉండగా.. తాజాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరికి వాయిదా వేశారు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర నూతన విడుదల తేదీని ప్రకటించారు.
మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) కాంబినేషన్‌లో తెరకెక్కిన యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ (Eagle). టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయాల్సి ఉండగా.. తాజాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరికి వాయిదా వేశారు. అందుకు కారణం సంక్రాంతి (Sankranthi)కి భారీ పోటీ ఉండటంతో.. ‘ఈగల్’ నిర్మాతలతో చర్చలు జరిపి సినిమాని వాయిదా వేసినట్లుగా ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు అధికారికంగా ప్రకటించారు. అయితే ‘మారింది తేదీ మాత్రమే కానీ.. మాసోడి మార్క్ మాత్రం కాదు’ అంటూ తాజాగా మేకర్స్ ఓ లేఖను విడుదల చేస్తూ.. ‘ఈగల్’ ఎప్పుడు విడుదల అవుతుందో అధికారికంగా విడుదల తేదీతో కూడిన పోస్టర్‌ని విడుదల చేశారు.
‘‘బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం.
మొండోడి మనసు పుట్ట తేనే. తన నిర్మాత, పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుండి ఫిబ్రవరికి తీసుకొచ్చాడు. అందరూ చూడాల్సిన జనరంజక చిత్రం ప్రదర్శించడానికి అంతే మొత్తంలో థియేటర్లు కావాల్సి ఉంటుంది. దర్శకుడు మొదలుకుని సృజనాత్మక సిబ్బంది పనిని ప్రేక్షకులు చూసి మెచ్చుకోవడానికి ఒక ఇరుకులేని వేదిక, సమయం కావాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బరిలో రద్దీని తగ్గించే నిర్ణయం తీసుకున్నారు. మారింది తేదీ మాత్రమే.. మాసోడి మార్క్ కాదు. థియేటర్లలో మాసివ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఫిబ్రవరి 9 సాక్ష్యం కాబోతోంది’’ అని ‘ఈగల్’ చిత్ర నిర్మాతలు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. (Eagle New Release Date)
‘ఈగల్’ సంక్రాంతి బరి నుండి తప్పుకోవడంతో.. ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుండి ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘సైంధవ్’, ‘నా సామిరంగ’ సినిమాలు మాత్రమే విడుదలకానున్నాయి. మరి వీటిలో ప్రేక్షకులను అలరించే చిత్రం ఏదనేది తెలియాలంటే పండగ వరకు ఆగాల్సిందే. రవితేజ (Ravi Teja) సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా ‘ఈగల్’లో నటించారు. నవదీప్, మధుబాల ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. దావ్‌జాంద్ ‘ఈగల్’కు సంగీతం అందించారు.
ఇవి కూడా చదవండి:
====================
*Mangalavaaram: ఓటీటీలో సంచలనం.. నెక్లస్ రోడ్‌లో అరాచకం.. ఎందుకు?
**************************
*Vijayakanth: ముఖ్యమంత్రి కావాల్సిన నేత విజయకాంత్.. ఈ మాట ఎవరన్నారంటే?
*************************
*Guntur Kaaram: సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటంటే?
******************************
*దీనస్థితిలో ఉన్న నటి పావల శ్యామలకు ‘మనం సైతం’ సాయం
**************************
*Tripti Dimri: ఈ నయా నేషనల్ క్రష్ గురించి.. ఈ విషయాలు తెలుసా?
************************