Rashmika Mandanna: అప్పట్లో ఇలా జరిగితే పరిస్థితి ఏంటి?
ABN , Publish Date - Feb 01 , 2024 | 06:41 PM
రష్మిక డీఫ్ ఫేక్ వీడియో ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే! ఆ విషయంలో సినీ, రాజకీయ ప్రముఖులు మద్దతుగా నిలిచారు. ఈ వివాదంపై ఇప్పటికే రష్మిక స్పందించింది. తాజాగా ఆమె మరోసారి స్పందించారు. ''ఇలాంటి వీడియోలపై అవగాహన కల్పించాలని తెలిపారు.
రష్మిక (Rashmika Mandanna) డీఫ్ ఫేక్ వీడియో (Deep fake video) ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే! ఆ విషయంలో సినీ, రాజకీయ ప్రముఖులు మద్దతుగా నిలిచారు. ఈ వివాదంపై ఇప్పటికే రష్మిక స్పందించింది. తాజాగా ఆమె మరోసారి స్పందించారు. ''ఇలాంటి వీడియోలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ‘‘ఇలాంటి చేదు అనుభవం నేను, స్కూల్, కాలేజీల్లో ఎదురైతే ఎవరూ మద్దతు ఇచ్చేవారు కాదు. దీని గురించి మాట్లాడితే సమాజం ఏమనుకుంటుందో అని భావించేవాళ్లు. డీప్‌ఫేక్ గురించి స్పందించాలా? వద్దా? అని నేనూ చాలా ఆలోచించాను. దీని గురించి మాట్లాడితే నా ఫాలోవర్స్ 41మిలియన్ల మందికి తెలుస్తుంది. వారంతా రకరకాలుగా స్పందిస్తారు. ఇలాంటి వాటి గురించి పట్టించుకోకుండా ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యమని భావించి రియాక్ట్ అయ్యాను. కాలేజీ అమ్మాయిలకు ఇలా జరిగితే పరిస్థితేంటని భయపడ్డాను. వాళ్లలో ధైౖర్యాన్ని నింపడం కోసమే దీనిపై స్పందించాను. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ అభివృద్ది చెందడంతో డీప్‌ఫేక్ వల్ల ఎంతో ఒత్తిడి కలుగుతోంది. ఎమోషన్స్ పై ప్రభావం చాలా ఉంటుంది’’ అని నేషనల్ క్రష్ రష్మిక అన్నారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి డీప్‌ఫేక్ రూపొందించారు. చూడటానికి అభ్యంతరకరంగా ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందంటూ రష్మిక ఆవేదన చెందారు. ఇటీవల ఈ కేసులో అనుమానితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల యానిమల్ చిత్రంతో భారీ విజయం అందుతున్న ురష్మిక పుుష్ప 2’లో నటిస్తున్నారు. ‘రెయిన్ బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాలతోనూ అ?రించేందుకు సిద్థమవుతున్నారామె!