Rashmi Gautam: తక్కువ శిక్షతో బయటపడడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు!

ABN , Publish Date - Jul 12 , 2024 | 07:24 PM

ఏపీలోని నంద్యాల జిల్లాలో తొమ్మిదేళ్ల చిన్నారిపై జరిగిన ఘటన ప్రతి ఒక్కరి మనసును కదిలించింది. ఆడుకుంటానని బయటకు వెళ్లగా ఆ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశారు.

ఏపీలోని నంద్యాల జిల్లాలో తొమ్మిదేళ్ల చిన్నారిపై జరిగిన ఘటన ప్రతి ఒక్కరి మనసును కదిలించింది. ఆడుకుంటానని బయటకు వెళ్లగా ఆ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో సుజాత, మద్దిలేటి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కూలిపని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. రెండవ కుమార్తె  5వ తరగతి చదువుతోంది.. అయితే, ఆదివారం సెలవు కావడంతో ఉదయం ఆడుకుంటానని ఇంటికి దగ్గరలోనే ఉన్న పార్క్‌లోకి వెళ్ళింది. మధ్యాహ్నం అయినా ఇంటికి చేరలేదు. తల్లిదండ్రులు వెతకగా కనిపించలేదు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురు మైనర్‌ బాలురుపై అనుమానంతో తమదైన స్టైల్‌లో విచారించారు రక్షకభటులే. అందులో ఒకరు బాలికపై అత్యాచారం చేసి మల్యాల ఎత్తిపోతల కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నారు. ఈ దారుణానికి కారణమైన ముగ్గురు 15 ఏళ్లలోపు వారే. ఈ అంశం మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.

తాజాగా ఈ ఘటనపై యాంకర్‌ రష్మీ ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. వాళ్లు పెద్దవాళ్లలాగా రేప్‌ చేయగలిగితే వాళ్లని పెద్ద వాళ్ళ లాగానే శిక్షించాలి. వాళ్ళు చేసిన తప్పుకు ఏ మాత్రం పశ్చాత్తాప పడటం లేదు కాబట్టి వాళ్ళు కచ్చితంగా మైనర్లు అయితే కాదు. మైనర్లు అనే ఒక కార్డుతో వాళ్ళు తక్కువ శిక్షతో బయటపడడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు’ అంటూ ఆమె తన సోషల్‌ మీడియా వేదికగా రాసుకొచ్చింది. 

Updated Date - Jul 12 , 2024 | 07:24 PM