Jani Master: కోర్టులో జానీ మాస్టర్‌కు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్‌ డిస్మిస్

ABN , Publish Date - Oct 14 , 2024 | 06:54 PM

జానీ మాస్టర్ కు రంగారెడ్డి కోర్టులో చుక్కెదురైంది. ఇటీవ‌ల తాను దాఖ‌లు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.

jani master

జానీ మాస్టర్ (Jani Master)కు రంగారెడ్డి కోర్టులో చుక్కెదురైంది. ఇటీవ‌ల తాను దాఖ‌లు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి నేప‌థ్యంలో పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదైన సంగ‌తి తెలిసిందే. అయితే త‌న‌కు వ‌చ్చిన నేష‌నల్‌ అవార్డును అందుకునే క్ర‌మంలో కోర్టు వారం క్రితం అక్టోబర్‌ 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఆ త‌ర్వాత ఆ అవార్డును నిలిపి వేయ‌డంతో జానీ మాస్ట‌ర్ త‌న బెయిల్‌ను ర‌ద్దు చేసుకుని జైలుకు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఆ వెంట‌నే తిరిగి బెయిల్ కోసం మ‌రోసారి అప్పీల్ చేయ‌గా ఇరు వ‌ర్తాల వాద‌న‌లు విని జానీ మాస్ట‌ర్ బెయిల్ పిటీష‌న్‌ను తాజాగా కోర్టు కొట్టివేసింది.


jani.jpg

ఇదిలాఉండ‌గా మరోవైపు జానీ మాస్టర్ కోసం ఆయన భార్య సుమలత పోరాటం చేస్తూనే ఉంది. ఇటీవ‌ల‌ జానీ మాస్టర్ కేసులో ఎవరైతే బాధితురాలిగా చెప్పబడుతుందో.. ఆమె తనపై లైంగిక దాడి చేసిందంటూ ఓ యువకుడు ఆమెపై కేసు పెట్టారు. జానీ మాస్టర్‌ అల్లుడైన షమీర్‌, తన మామ జానీ మాస్టర్‌తో కలిసి హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్‌లకు వెళ్లినప్పుడు.. ఆమె లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందని, అప్పుడు తాను మైనర్‌నని చెబుతూ.. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేయబోతున్నట్లుగా సమాచారం.

Updated Date - Oct 14 , 2024 | 06:54 PM