Rana Daggubati: కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్‌!

ABN , Publish Date - Jul 11 , 2024 | 10:16 AM

రానా దగ్గుబాటి విలక్షణ పాత్రలు చేస్తూనే కథా బలమున్న చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన నిర్మాణంలో రెండు చిత్రాలను ప్రకటించారు.

రానా దగ్గుబాటి (Rana Daggubati)విలక్షణ పాత్రలు చేస్తూనే కథా బలమున్న చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన నిర్మాణంలో రెండు చిత్రాలను ప్రకటించారు. అయితే నటుడిగా ఆయన నుంచి ‘విరాట పర్వం’ తర్వాత పూర్తిస్థాయి  సినిమా రాలేదు. తేజ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించినా అది ఇంకా పట్టాలెక్కలేదు. రజనీకాంత్‌ సినిమా ‘వేట్టయాన్‌’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు ‘రానా నాయుడు’ (Rana Naidu) సిరీస్‌ రెండో భాగంలోనూ నటిస్తున్నారు.

తాజాగా ఆయన కొత్త దర్శకుడు కిశోర్‌ (Kishore) చెప్పిన కథకు పచ్చజెండా ఊపినట్టు సమాచారం. ఆర్కా మీడియా వర్క్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది.  కథానాయికగా శ్రీనిధి శెట్టి పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ పొడక్షన్  పనుల్లో ఉన్న ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

Updated Date - Jul 11 , 2024 | 10:20 AM