Ram Gopal Varma: గురిపెట్టింది ఒకరికి.. పేల్చింది మరొకరిని..

ABN , Publish Date - Oct 07 , 2024 | 08:54 AM

భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ, సమంతపై చేసిన ఆరోపణలపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియా వేదికగా మరోసారి స్పందించారు.


భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTRBRS)ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అక్కినేని ఫ్యామిలీ(Akkineni Family), సమంతపై (Samantha) చేసిన ఆరోపణలపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియా వేదికగా మరోసారి స్పందించారు. ‘కొండా సురేఖ తుపాకి గురిపెట్టింది కేటీఆర్‌కు, కాల్చింది మాత్రం నాగార్జున, నాగచైతన్యను, క్షమాపణ చెప్పిందేమో సమంతకు.. ఐన్‌స్టీన్‌ కూడా ఈ ఈక్వేషన్‌ను పరిష్కరించలేడేమోనని నా డౌట్‌’ అంటూ 9Ram gopam Varma) ఆయన ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన  చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. అంతే కాదు నాలుగు రోజుల క్రితం కూడా ఆయన నాగ్‌ ఫ్యామిలీకి సపోర్ట్‌గా మాట్లాడారు. "ఒక మినిస్టర్‌ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్‌ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ నటి మీద అంత నీచమైన మాటలనంటాన్ని తీవ్రంగా ఖండించాలి. నాగార్జున కుటుంబాన్ని అత్యంత హార్రిబుల్‌గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి షాక్‌ అయ్యాను. తన రాజకీయ ప్రత్యర్థి మీద  పగ తీర్చుకోవడానికీ మధ్యలో ఇండస్ట్రీ, సమాజంలో గౌరవం ఉన్న  నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం ఏ మాత్రం కరెక్ట్‌ కాదు. కేటీఆర్‌ దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్థమేంటో కనీసం ఆవిడకైనా అర్థమయ్యుంటుందో లేదో నాకర్థమవ్వటంలేదు! తనని రఘునందన్‌ ఇష్యూలో ఎవరో అవమానించారనీ అసలు ఈ  ఇష్యూతో  ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యలను  అంతకన్నా దారుణంగా అవమానించటమేంటి? ఫోర్త్‌ గ్రేడ్‌ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు మీడియా ముందు చెప్పడం దారుణం.  సీఎం రేవంత్‌ రెడ్డి ఈ విషయంలో వెంటనే స్పందించి ఇలాంటివి మరోసారి జరగకుండా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇవ్వాలని ఇండస్ర్టీ తరపున కోరుతున్నాం.

అంతే కాదు కొండా సురేఖ సమంతకు క్షమాపణ చెప్పడమేంటి అని ఆర్‌జీవీ ప్రశ్నించారు. సమంతను ఆమె అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది. నాగార్జునని, నాగచైతన్యని ఒక మామగారు, భర్త, కోడలిని, భార్యను వాళ్లకు సంబంధించిన ఆస్తి కాపాడుకోవడానికి బలవంతంగా పంపించడానికి ట్రై చేస్తే తను విడాకులు ఇచ్చి వెళ్లిపోయిందని చెప్పడం కన్నా ఘోరమైన అవమానం నేను జీవితంలో వినలేదు. ఇది సమంతను అవమానించడం ఎలా అయింది? వారిద్దరి కోసమే కాకుండా ఇండస్ట్రీలో ఉండే అందరికోసం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని నాగార్జున, చైతన్య  సదరు వ్యక్తులకు గుణపాఠం చెప్పాలి’’ అని ఆర్‌జీవీ గత ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Updated Date - Oct 07 , 2024 | 09:01 AM