RGV: 'సూపర్ హీరోకి సరికొత్త డెఫినేషన్..' క్షమించండి
ABN , Publish Date - Dec 08 , 2024 | 08:05 AM
ఒక ప్రసిద్ధ తెలుగు సినిమా డైలాగ్‌లో చెప్పినట్లు.. 'తోపే తోప్ అని చెప్పినంక ఏం జేస్తం.. మూస్కొని కూసుంటాం' అన్నట్లు ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఇంతకీ ఏ తోపు.. ఏ తోప్ గురించి మాట్లాడారు అంటే..
భారతీయ సినీ చరిత్రలో అత్యంత గర్వించదగ్గ డైరెక్టర్‌లలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఆయన తీసిన సత్య, సర్కార్, శివ, గాయం వంటి సినిమాల ఇన్స్పిరేషన్‌తోనే సినీ ఇండస్ట్రీలో గ్యాంగ్‌స్టర్‌లు, మోన్‌స్టాస్టర్‌లు, డైనోసార్లు పుట్టుకొచ్చారు. పాత్రల పదనును ఇన్‌టెన్సిటీతో చెక్కడంలో రాముకి ఎవరు సాటి లేరు. అలాంటి వర్మ 'పుష్ప రాజ్' పాత్రకు ఫిదా అయిపోయారు. అల్లు అర్జున్ కంటే పుష్ప రాజే గొప్ప అంటూ రామ్ గోపాల్ వర్మ ఎందుకు అన్నారో ఆయన మాటల్లోనే చదవండి..
తాజాగా రిలీజైన 'పుష్ప 2' సినిమాలో పుష్ప రాజ్ క్యారెక్టర్‌కి వర్మ రివ్యూ ఇచ్చారు. ఆయన ట్వీట్ చేస్తూ.. "ఇండియన్ సినిమాల్లో బలమైన, పదునైన పాత్రలు చాలా అరుదుగా ఉంటాయి. అంతకుమించిన మరొక విషయం ఏంటంటే, ఒక స్టార్ హీరో తన ఇమేజ్‌ని పక్కకు పెట్టి, ఇలాంటి పాత్రలో నటించడం అరుదు. 'పుష్పరాజ్' లాంటి పాత్రలు రావడం చాలా చాలా అరుదు. సినిమా చూస్తున్నప్పుడు వాస్తవ ప్రపంచంలో పుష్పలాంటి పాత్ర ఉంటుందని ఒక సగటు ప్రేక్షకుడిగా నాకూ అనిపించింది. కమర్షియల్ హంగులున్న సినిమాలో నిజంగా అలాంటి పాత్రను చూపించడం అంత సులభమైన విషయం కాదు. పుష్ప పాత్ర అనేది అనేక వైరుధ్యాలతో కూడుకున్నది. అమాయకత్వం, ఎదుటి వారిని మోసం చేసే తెలివితేటలు, తారస్థాయిలో ఉండే అహం ఇలా అన్నీ కలగలిపి ఉంటాయి"
"వైకల్యం కలిగిన ఒక వ్యక్తి సూపర్ యాక్షన్ హీరో అవుతాడని ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే సూపర్ హీరోకు ఉండే డెఫినేషన్ వేరు. ఆ డెఫినేషన్ ప్రకారం సూపర్ హీరో అన్నింటిలోనూ పర్ఫెక్ట్ గా ఉండాలి. కానీ, పుష్ప క్యారెక్టర్‌లో నటించిన అల్లు అర్జున్ సూపర్ హీరోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. మునుపెన్నడూ చూడని బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ ఆ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చాయి. సినిమా చరిత్రలో, ప్రేక్షకుల మదిలో దశాబ్దాల పాటు పుష్పరాజ్ పాత్ర ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది. తన పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో అల్లు అర్జున్ జీవించాడు. సీఎం తనతో ఫొటో దిగడానికి ఆసక్తి చూపించనప్పుడు, తన అహాన్ని చంపుకొని భన్వర్ సింగ్ కి సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు విపరీతంగా మద్యం తాగడం వంటి ఎమోషనల్ సన్నివేశాల ద్వారా అల్లు అర్జున్ ఆ పాత్రకు ప్రాణం పోశారు. కేవలం అతడి హావభావాలే కాదు, బలమైన భావోద్వేగాలు ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయి. ఈ విషయాన్ని చెప్పినందుకు క్షమించండి కానీ, 'పుష్ప2' జర్నీని ఆస్వాదించాక ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. పుష్పరాజ్ పాత్ర ముందు అల్లు అర్జున్ కూడా తక్కువే అనిపించాడు" అంటూ ముగించారు.