Game Changer: 'గేమ్ ఛేంజర్'కి పొలిటికల్ మైలేజ్.. రంగంలోకి ఆ నాయకుడు
ABN , Publish Date - Nov 19 , 2024 | 07:18 PM
సోషల్ మీడియాలో ఇప్పటికే మెగా వర్సెస్ అల్లు రచ్చ తలనొప్పి తెప్పిస్తుంటే, ఇప్పుడు అది పుష్ప వర్సెస్ గేమ్ ఛేంజర్ మారనున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు పుష్ప 2 దేశవ్యాప్తంగా సంచనాలు సృష్టిస్తుంటే గేమ్ ఛేంజర్ పొలిటికల్ రంగును పులుముకోనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమైందంటే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. జనవరి 10వ తేదీన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ పొందుతుంది. కాగా, మరోవైపు దేశం మొత్తం 'పుష్ప 2' హవా కనిపిస్తుండటంతో గేమ్ ఛేంజర్ టీమ్ ప్రమోషన్స్‌లో గేర్ మార్చేందుకు సిద్ధమైంది. ఒకవైపు సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా రచ్చ జరుగుతున్న తరుణంలో 'గేమ్ ఛేంజర్' పొలిటికల్ రంగును పులుముకోనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమైందంటే..
శంకర్ సినిమా అంటే సోషల్ బేస్‌డ్‌గా ఉంటూ పొలిటికల్ టచ్‌తో కనిపిస్తాయి. దాదాపు ఆ ఫార్ములాతో గేమ్ ఛేంజర్ సినిమా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ సరికొత్త తరహాలో ముందుకు వెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ ఈవెంట్‌ని ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో నిర్వహించారు. అయితే మరో భారీ ఈవెంట్‌ని ఏపీలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్‌కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని గెస్ట్‌గా పిలిచే యోచనలో ఉన్నారట. దీంతో పుష్ప హైప్‌ని బీట్ చేసేందుకు పెద్ద వ్యూహమే రచించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబందించిన వివరాలను మూవీ మేకర్స్ మాత్రం అఫీషియల్‌గా ప్రకటించలేదు. సో, ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ తెలియాల్సి ఉంది.
మరోవైపు పుష్ప 2, గేమ్ ఛేంజర్ సినిమాల రిలీజ్‌లు రెండు కుటుంబాలను కలిపే ప్రయత్నం చేస్తాయేమో అని కొందరు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం కుటుంబాల మధ్య మరింత గ్యాప్ ఏర్పడటానికి కారణం కావొచ్చని విశ్లేషిస్తున్నారు. అయితే ఫ్యాన్స్ సెన్సిబుల్‌గా వ్యవహరిస్తే ఎలాంటి రిజల్ట్ వచ్చిన సోషల్ మీడియాలో కొత్త రచ్చ ఏర్పడే అవకాశముండదని ఇంకొందరు సూచిస్తున్నారు.