Surekha Konidala: రామ్ చరణ్ బర్త్‌డే.. కొణిదెల సురేఖ ఏం చేశారో తెలుసా?
ABN , Publish Date - Mar 27 , 2024 | 06:45 PM
రెండు రాష్ట్రాలలో ఈరోజు పండుగ వాతావరణం నెలకొంది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే చరణ్ తల్లి సురేఖ ఓ రోజు ముందే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది.
రెండు రాష్ట్రాలలో ఈరోజు పండుగ వాతావరణం నెలకొంది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (RamCharan) పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు, రక్తదానాలు, అన్నదానాలు చేస్తూ రామ్‌చరణ్‌పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అదేవిధంగా మగధీర చిత్రాన్ని రీ రిలీజ్ చేయడంతో చాలామంది థియేటర్ల బాట పట్టారు. ఇక సోషల్‌మీడియాలో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేకుండా ఫ్యాన్స్ దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు అంతా శుభాకాంక్షలు తెలుపుతూ రామ్‌చరణ్ పేరును ట్రెండింగ్‌లో నిలిపారు.
అయితే.. జన్మదినాన్ని పురస్కరించుకుని రామ్‌చరణ్ (RamCharan) తన భార్య ఉపాసన, కూతురు క్లింకార, అత్తమామలతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శణం చేసుకున్నారు. మరోవైపు చరణ్ బర్త్ డే కానుకగా ఆయన నటిస్తున్న గేమ్ ఛేంజర్ (GameChanger) సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు. ఇలా ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో రామ్ చరణ్ (RamCharan) పుట్టిన రోజును జరుపుకోగా తల్లి సురేఖ (Surekha Konidala) ఓ రోజు ముందే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది.
ముందుగా అపోలో ఆస్పత్రిలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి అనంతరం తమ అత్తమ్మాస్ కిచెన్ సంస్థ సౌజన్యంతో 500 మందికి పైగా అన్నదానం చేశారు. సూరేఖ (Surekha Konidala) గారే దగ్గరుండి వంటలు చేయించి, అక్కడికి వచ్చిన వారికి కోడలు ఉపాసన, కూతుర్లు, మనుమరాళ్లతో కలిసి వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరూ ఓ లుక్కేయండి మరి.