Ram Charan: తన సోపతి భీమ్‌కి శుభాకాంక్షలు తెలిపిన రామ్

ABN , Publish Date - Sep 26 , 2024 | 08:42 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నటించిన ‘దేవర’ సినిమా విడుదలను పురస్కరించుకుని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తన సోపతి భీమ్‌కి రామ్ శుభాకాంక్షలు తెలిపాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలు మ్యాటర్‌లోకి వస్తే..

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (Young Tiger NTR) నటించిన ‘దేవర’ (Devara) సినిమా విడుదలను పురస్కరించుకుని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) ట్విట్టర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇంతకు ముందు రామ్, భీమ్‌గా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసి.. ఆస్కార్ అవార్డును అందుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ సమయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా వారి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని తెలియజేశారు. ప్రాణ స్నేహితులమని ఒకరి బర్త్‌డేకి మరొకరు ఏమేం చేసేవారో కూడా పబ్లిగ్గా చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి వారి అభిమానులలో కూడా చాలా వరకు ఛేంజ్ వచ్చింది. ఆ సినిమా తర్వాత వారిద్దరి స్నేహం ఇంకా బలపడుతూనే ఉంది.


Jr-ntr-Devara.jpg

అంతకు ముందు ఎప్పుడూ లేనిది.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఒకరి బర్త్‌డేకి మరొకరు ట్విట్టర్ వేదికగా విష్ చేసుకోవడం కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నటించిన సోలో సినిమా ‘దేవర’ విడుదల అవుతున్న వేళ.. నా బ్రదర్ తారక్ సినిమా విడుదల సందర్భంగా తనకి, చిత్ర టీమ్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ రామ్ చరణ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు ‘థ్యాంక్యూ అన్నా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో.. ఎలాంటి ఈగోలకు పోకుండా ఇలా స్టార్ హీరోలందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటుండటం విశేషం.


మరోవైపు మరో మెగా హీరో సాయిదుర్గ తేజ్ (Sai Durgha Tej) కూడా ట్విట్టర్ ఎక్స్ వేదికగా ‘దేవర’ సినిమా యూనిట్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సాయిదుర్గా తేజ్ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. ‘దేవర’ విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లతో చేసిన ‘ఆచార్య’ సినిమా అనంతరం కొరటాల శివ కసిగా చేసిన చిత్రం ‘దేవర’. రెండు పార్ట్‌లుగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. మరోవైపు రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ (Game Changer) మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్‌లో ఉంది. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది.

Also Read- Movie Ticket Mafia: అభిమానుల జేబులు గుల్ల చేస్తున్న బెనిఫిట్‌ షోలు

Also Read- Harsha Sai: అసలెవరీ హర్షసాయి.. మరో మెగాస్టార్ అంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా ఏమయ్యారు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 26 , 2024 | 08:42 PM