Ram Charan: ప్రభాస్ కాదు చరణ్.. నయా రికార్డ్

ABN , Publish Date - Dec 21 , 2024 | 09:43 AM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ప్రభాస్ రికార్డుని బ్రేక్ చేయనున్నారు. దీంతో చెర్రీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతకీ ప్రభాస్ పెట్టిన టార్గెట్ ఏంటి? చరణ్ దాన్ని ఎలా బ్రేక్ చేశాడు అంటే..

టాలీవుడ్ అగ్ర హీరోల సినిమా రిలీజ్ లకు, పుట్టిన రోజు వేడుకలకి, ఇతర ఈవెంట్ లకి భారీ కటౌట్లను పెట్టే సంప్రదాయం ఎప్పటి నుండో ఉంది. అయితే అన్ని సినిమా ఇండస్ట్రీలకు మించి టాలీవుడ్ లోనే హయ్యెస్ట్ హైట్ ఉన్న కటౌట్లను నిర్మించారు. ఇప్పటి వరకు హయ్యెస్ట్ హైట్ 230 ఫీట్ల కటౌట్ హీరో ప్రభాస్ కోసం నిర్మించారు. ఇప్పుడు ఆ రికార్డ్ ను చరణ్ ఫ్యాన్స్ చెరిపేశారు. ఈ కటౌట్ ఎక్కడ నిర్మిస్తున్నారంటే..


గతేడాది ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్, కూకట్ పల్లి థైత్లాపూర్ గ్రౌండ్ లో 230 ఫీట్ల కటౌట్ ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సాహో, సలార్, కల్కి సినిమాల రిలీజ్ అప్పుడు కూడా ఈ రేంజ్ కటౌట్లను చూశాం. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రమోషన్స్ దృష్ట్యా విజయవాడలోని వజ్ర గ్రౌండ్స్ లో భారీ కటౌట్ ని ఏర్పాటు చేయనున్నారు. దీనిని 250 ఫీట్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. డిసెంబర్ 29న స్వయంగా రామ్ చరణ్ ఈ కటౌట్ ని లాంచ్ చేస్తారు. దీంతో ప్రభాస్ కటౌట్ రికార్డుని చరణ్ బ్రేక్ చేయనున్నాడు. కటౌట్ రికార్డుని బ్రేక్ చేసినట్లుగానే సినిమా రికార్డులని కూడా బ్రేక్ చేస్తాడా అని తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

GfPbpGHWQAAFyuw.jpg


ఇక సినిమా విషయానికొస్తే.. రామ్ చ‌ర‌ణ్ రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో కనిపించనున్నారు. ఈ మూవీ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పోస్ట‌ర్స్‌, ‘జ‌ర‌గండి జ‌రగండి.. ’, ‘రా మచ్చా రా..’, ‘నా నా హైరానా’ సాంగ్స్‌కు, టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. లార్జ‌ర్ దేన్ లైఫ్ సినిమాల‌ను తెర‌కెక్కించే డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న‌ ‘గేమ్ చేంజర్’ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించిన ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా సాయి మాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు.

Updated Date - Dec 21 , 2024 | 10:10 AM