The India House: రామ్‌చ‌ర‌ణ్.. ది ఇండియా హౌస్ మొద‌లైంది

ABN , Publish Date - Jul 02 , 2024 | 05:15 PM

నిఖిల్, సాయి మంజ్రేక‌ర్ జంట‌గా ది ఇండియా హౌస్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ యూవీ క్రియేషన్స్‌ విక్రమ్ రెడ్డి వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

The India House: రామ్‌చ‌ర‌ణ్.. ది ఇండియా హౌస్ మొద‌లైంది
The India House

నిఖిల్ (Nikhil Siddhartha),సాయి మంజ్రేక‌ర్ (Saiee M Manjrekar) జంట‌గా ది ఇండియా హౌస్ (India House) చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) నిర్మాత‌గా మారి యూవీ క్రియేషన్స్‌ విక్రమ్ రెడ్డి (Vikram Reddy) వి మెగా పిక్చర్స్ (V Mega Pictures), అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ (Abhishek Agarwal Arts) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

d28d2ad0-d1a5-4d67-90dc-3b66c247cfa8.jpeg

తాజాగా క‌ర్ణాట‌క హంపిలోని విరూపాక్ష దేవాలయంలో పూజ‌లు చేసి చిత్రాన్ని గ్రాండ్‌గా ప్రారంభించారు. రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) కీలక పాత్రలో కనిపించనున్నారు. ల‌వ్‌, రెవ‌ల్యూష‌న్ క‌థ నేప‌థ్యంలో 1905 నాటి బ్యాక్ డ్రాప్‌లో రూపొందనున్న ఈ పీరియడ్ డ్రామా షూటింగ్ రేప‌టి (బుధ‌వారం) నుంచి ప్రారంభం కానున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.


05955dee-e222-47e4-abd5-f28808d37b28.jpeg

టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం ప‌ని చేయనున్నార‌ని, డీవోపీ కెమరూన్ బ్రైసన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా విశాల్ అబానీ వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట‌లు తెలిపారు. మ‌రిన్ని వివ‌రాలు త్వరలో తెలియజేయ‌నున్న‌ట్లు మేకర్స్ ప్ర‌క‌టించారు.

c81eae59-4fcf-49ce-ad55-e78e5c7e21b4.jpeg

Updated Date - Jul 02 , 2024 | 05:15 PM