Ram Charan: రామ్ చరణ్ భారీ విరాళం.. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారంటే..
ABN , Publish Date - Sep 04 , 2024 | 04:25 PM
వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇదంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి సైతం భారీ విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత డొనేట్ చేశారంటే..
వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇదంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి సైతం భారీ విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలకు ఎప్పుడు, ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ముందుకు వచ్చేది సెలబ్రిటీలే. ఇప్పుడు కూడా మేమున్నామంటూ వరద బాధితులను ఆదుకునేందుకు భారీగా విరాళాలను ప్రకటిస్తూ.. గొప్ప మనసు చాటుకుంటున్నారు. కష్ట సమయంలో ప్రభుత్వాలకు, ప్రజలకు అండగా ఉండేందుకు ముందుకు వస్తున్న వారిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.
Also Read-Pawan Kalyan: రూ. 6 కోట్ల విరాళం.. గొప్ప మనసు చాటుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
‘‘వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు (Rs.1 Crore) విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను..’’ అని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలంతా దాదాపు రూ. కోటి విరాళం ప్రకటించి తమ గొప్ప మనసును చాటుకున్నారు.
ఇప్పటి వరకు.. ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారంటే..
పవన్ కళ్యాణ్: ఏపీకి రూ. 5 కోట్లు, తెలంగాణకు రూ. కోటి
ప్రభాస్: ఏపీకి రూ. కోటి, తెలంగాణకు రూ. కోటి
చిరంజీవి: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
బాలకృష్ణ: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
మహేష్ బాబు: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
రామ్ చరణ్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
ఎన్టీఆర్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
అల్లు అర్జున్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
అక్కినేని కుటుంబం, గ్రూప్ కంపెనీస్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
త్రివిక్రమ్, రాధాకృష్ణ, నాగవంశీ: ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 25 లక్షలు
వైజయంతీ మూవీస్: ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 20 లక్షలు
సిద్ధు జొన్నలగడ్డ: ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు
సాయి ధరమ్ తేజ్: ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 10 లక్షలు
విశ్వక్ సేన్: ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు
వెంకీ అట్లూరి: ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు
అనన్య నాగళ్ల: ఏపీకి రూ. 2.5 లక్షలు, తెలంగాణకు రూ. 2.5 లక్షలు
యాంకర్ స్రవంతి చొక్కారపు: ఏపీకి రూ. లక్ష, తెలంగాణకు రూ. లక్ష
బన్నీ వాస్: ‘ఆయ్’ ఈ వారం కలెక్షన్స్‌లో 25 శాతం ఏపీకి
కోట శ్రీనివాసరావు: ఏపీకి రూ. లక్ష
అలీ: ఏపీకి రూ. 3 లక్షలు, తెలంగాణకు రూ. 3లక్షలు
Read Latest Cinema News