RC 16: బుచ్చి బాబు ఆడించే ఆటలో చేంజ్..

ABN , Publish Date - Dec 08 , 2024 | 08:52 AM

రామ్‌చరణ్‌-బుచ్చి బాబు కాంబోలో తెరకెక్కుతున్న 'RC 16'లో బుచ్చి బాబు గేర్లు ఫాస్ట్‌గా షిఫ్ట్ చేస్తున్నారు.

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సాన (Sana Buchibabu) 'ఆర్‌సీ16’ (RC 16) వర్కింగ్‌ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్థి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతిలోక శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ చరణ్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌ పవర్‌ఫుల్‌ రోల్‌ ప్లే చేస్తున్నారు. అయితే ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా ఇటీవలే ప్రారంభమై మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ గేమ్ ఛేంజింగ్ ఎపిసోడ్‌ని చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే..


RC 16 ఈ ఏడాది ప్రారంభం మార్చిలో పూజ కార్యక్రమాలు చేసుకున్న.. గత నెల 22న మైసూరులో షూటింగ్ కి నోచుకుంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌ చరణ్‌, జాన్వీల కీలక సన్నివేశాలను బుచ్చి బాబు సూపర్ ఫాస్ట్‌గా చిత్రీకరించారు. చరణ్, జాన్వీలతో పాటు సినిమాలోని మెయిన్ కాస్ట్ షూటింగ్ లో పాలుపంచుకున్నారు. దీంతో ఈ షెడ్యూల్ పూర్తైంది. నెక్స్ట్ షెడ్యూల్ సోమవారం నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఒక గేమ్ బేస్డ్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని రక్తి కట్టించేలా బుచ్చిబాబు రూపొందిస్తున్నారు.

Untitled-1 copy.jpg


ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. మట్టి లాంటి కథ ఇదని ఇప్పటికే రామ్‌చరణ్‌ చెప్పారు. ఇప్పటి వరకూ చేసిన చిత్రాలో ఈ చిత్రం ది బెస్ట్‌ అవుతుందని కూడా ఆయన ఓ వేదికపై వెల్లడించారు. ఉప్పెనతో భారీ విజయం అందుకుని నేషనల్‌ అవార్డు అందుకున్న దర్శకుడు సాన బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పూర్తిస్థాయి కథతో పకడ్భందీగా సెట్స్‌ మీదకెళ్తున్నారు. ఇక రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వం వహించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ మొదలయ్యాయి. కియారా అడ్వాణీ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సునీల్‌, సముద్రఖని, అంజలి కీలక పాత్రధారులు.

Updated Date - Dec 08 , 2024 | 08:52 AM