Kalki Celebs TalK : అరుదుగా స్పందించే రజినీ కూడా..

ABN , Publish Date - Jun 29 , 2024 | 02:58 PM

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్  దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడీ’  ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమాపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Kalki Celebs TalK : అరుదుగా స్పందించే రజినీ కూడా..


ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్ (nag ashwin) దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడీ’  (Kalki 2898 AD) ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమాపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను గురించి తలైవా రజనీకాంత్‌ (Rajinikanth) ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. కింగ్‌ నాగార్జున(Nagarjuna) కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. సోషల్‌ మీడియాలో అరుదుగా స్పందించే రజనీ ‘కల్కి’ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించడంతో ప్రభాస్‌ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.



‘‘కల్కి’ చూశాను. అద్భుతంగా ఉంది. ఎపిక్‌ సినిమా అనేలా ఉంది. ఇండియన్‌ సినిమాను నాగ్‌అశ్విన్‌ మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇందులో నటించిన వారికి, ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు. రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని రజనీకాంత్‌ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రిప్లై ఇస్తూ.. మాటలు రావడం లేదన్నారు. టీమ్‌ అందరి తరఫున కృతజ్ఞతలు’’ అని నాగీ పోస్ట్‌ చేశారు.

kalki.jpg



అక్కినేని నాగార్జున కూడా సోషల్‌ మీడియా వేదికగా టీమ్‌కు అభినందనలు తెలిపారు. "నాగ్‌ అశ్విన్  మీరు ఈ సినిమాతో ఒక టైమ్‌ నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. పురాణాలు, చరిత్ర నుంచి అల్లుకున్న కథను అద్భుతంగా తెరపై చూపించారు. అమితాబ్‌ మీరు అసలైన మాస్‌ హీరో.. మీ నటనతో మరోసారి సత్తా చాటారు. పార్ట్‌2లో కమల్‌ హాసన్‌  సర్‌ పాత్రను పరిపూర్ణంగా  చూడడం కోసం వేచిచూస్తున్నా. ప్రభాస్‌ నువ్వు మరోసారి సత్తా చాటావు. దీపికా చాలా అద్భుతంగా నటించారు. మీరంతా కలిసి ఇండియన్‌ సినిమా స్థాయిని మరోసారి నిరూపించారు’ అని ప్రశంసించారు. హాలీవుడ్‌ సైతం కల్కి చిత్రంపై ప్రశంసలు కురిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్‌ మీడియా సంస్థ డెడ్‌ లైన్‌ ‘కల్కి’ అద్భుతంగా ఉందని పేర్కొంది.  

యష్, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కూడా ట్విట్టర్ వేదికగా సినిమాపై ప్రశంసలు కురిపించారు 

Updated Date - Jun 29 , 2024 | 04:47 PM