Raj Tarun: 'పురుషోత్తముడు' ట్రైలర్ విడుదల 

ABN , Publish Date - Jul 20 , 2024 | 03:45 PM

రాజ్ తరుణ్ (Raj Tarun)హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'పురుషోత్తముడు' (Purushothamudu).  శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

రాజ్ తరుణ్ (Raj Tarun)హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'పురుషోత్తముడు' (Purushothamudu).  శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. "ఆకతాయి", "హమ్ తుమ్" చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా ఈ నెల 26వ తేదీన విడుదల కాబోతుంది. శనివారం ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. 

దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ - ఈ రోజు ఫిలింనగర్ దైవసన్నిధానం, మోతీనగర్ రామాయలయంలో పూజా కార్యక్రమాలునిర్వహించి ట్రైలర్ లాంచ్ చేసాం. అతి తక్కువ టైమ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, యాక్షన్, మంచి మ్యూజిక్ వంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులందరికీ నచ్చేలా "పురుషోత్తముడు" సినిమా ఈ నెల 26న మీ ముందుకు రాబోతోంది. "పురుషోత్తముడు" థియేటర్స్ లో ఒక పండగ లాంటి వాతావరణం తీసుకొస్తుందని, మీ అందరి ఆదరణ సినిమాకు దక్కుతుందని ఆశిస్తున్నాం"  అన్నారు.
Raj-tarun2.jpg

నిర్మాత డా.రమేష్ తేజావత్ మాట్లాడుతూ - "పురుషోత్తముడు" ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఈ పాజిటివ్ రెస్పాన్స్ థియేటర్స్ లోనూ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నా. "పురుషోత్తముడు" సినిమా నిర్మించడం నా కల. నిర్మాతగా ఒక మంచి మూవీ చేశామని నమ్ముతున్నాం. సకుటుంబంగా మా సినిమాకు రండి మీరంతా తప్పకుండా ఎంజాయ్ చేసేలా "పురుషోత్తముడు" సినిమా ఉంటుంది. అన్నారు.


Updated Date - Jul 20 , 2024 | 07:48 PM