Raj Tarun:  'భలే ఉన్నాడే' ట్రైలర్ ఎలా  ఉందో చూశారా?   

ABN , Publish Date - Aug 19 , 2024 | 06:51 PM

రాజ్ తరుణ్ (Raj tarun) నటిస్తున్న చిత్రం 'భలే ఉన్నాడే' (Bhale unnade). సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాకున్నా ఈ చిత్రం  ట్రైలర్ సోమవారం రిలీజ్ చేశారు.

రాజ్ తరుణ్ (Raj tarun) నటిస్తున్న చిత్రం 'భలే ఉన్నాడే' (Bhale unnade). రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్ (Shiva Sai vardhan).  మారుతి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.  సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాకున్నా ఈ చిత్రం  ట్రైలర్ సోమవారం రిలీజ్ చేశారు. అమ్మాయిలంటే ఆమడ దూరంలో వుండే హీరో పాత్రని హిలేరియస్ గా పరిచయం చేస్తూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. రాజ్ తరుణ్ , మనీషా కంద్కూర్ ల మధ్య వచ్చే సన్నివేశాలు, వారి లవ్ స్టొరీ చాలా ఎంటర్ టైనింగ్ గా వున్నాయి. ట్రైలర్ లో ఫన్ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. టీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్స్, వారి టైమింగ్ చూస్తుంటే సినిమాలో ఎంటర్టైమెంట్ అదిరిపోతుందని అర్ధమౌతోంది.  వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Updated Date - Aug 19 , 2024 | 06:51 PM